కార్తీక దీపం: సౌందర్యతో ప్రకాష్ రాజ్ డైలాగ్ కొట్టిన డాక్టర్ బాబు.. వైరల్ పోస్ట్!

pratap reddy   | Asianet News
Published : Aug 18, 2021, 04:14 PM IST
కార్తీక దీపం: సౌందర్యతో ప్రకాష్ రాజ్ డైలాగ్ కొట్టిన డాక్టర్ బాబు.. వైరల్ పోస్ట్!

సారాంశం

బుల్లితెరపై కార్తీక దీపం బ్లాక్ బస్టర్ సీరియల్ గా దూసుకుపోతోంది. హీరోగా డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్న నిరుపమ్, తల్లి పాత్రలో నటిస్తున్న అర్చన అనంత్, ఇక అందరి ఫేవరిట్ వంటలక్క తమ నటనతో అలరిస్తున్నారు.

బుల్లితెరపై కార్తీక దీపం బ్లాక్ బస్టర్ సీరియల్ గా దూసుకుపోతోంది. హీరోగా డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్న నిరుపమ్, తల్లి పాత్రలో నటిస్తున్న అర్చన అనంత్, ఇక అందరి ఫేవరిట్ వంటలక్క తమ నటనతో అలరిస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ బాబు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో కార్తీక దీపం కథ రంజుగా మారింది. 

లేటెస్ట్ గా నిరుపమ్ సెట్స్ నుంచి క్యూట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన తల్లి సౌందర్యగా నటిస్తున్న అర్చన పిక్స్ ని షేర్ చేశాడు. నిరుపమ్ కటకటాల వెనుక ఉండగా.. అర్చన అతడిని ఆటపట్టిస్తోంది. 

ఈ పిక్స్ పై నిరుపమ్ ప్రకాష్ రాజ్ డైలాగ్ కొడుతూ ఫన్నీ పోస్ట్ పెట్టాడు. 'అడగకుండానే డాక్టర్ ని చేశావ్. పిలవకుండానే స్టేషన్ కి వచ్చావ్. ఇంకా ఎందుకమ్మా నన్ను లోపలే ఉంచావ్. అయినా నువ్వు నాకు నచ్చావ్' అని నిరుపమ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. 

ఈ పోస్ట్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. కార్తీక దీపం సీరియల్ ద్వారా నిరుపమ్, అర్చన, వంటలక్క ప్రేమి విశ్వనాధ్ క్రేజీ సెలెబ్రటీలుగా మారారు. ఈ సీరియల్ లో నటనకు గాను వీరికి పలు అవార్డులు సొంతం అవుతున్నాయి. వీరికి బుల్లితెరపై మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?