70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన ప్రారంభం అయింది. జాతీయ అవార్డుల్లో ఎన్ని తెలుగు చిత్రాలు ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన ప్రారంభం అయింది. జాతీయ అవార్డుల్లో ఎన్ని తెలుగు చిత్రాలు ఉంటాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పాన్ ఇండియా వైడ్ గా వసూళ్ల ప్రభంజనం సృష్టించిన కార్తికేయ 2 చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది.
రీజినల్ లాంగ్వేజ్ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 అవార్డు గెలుచుకుంది. చందు ముండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం 2022లో విడుదలై పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసుకుంది.
అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో చందు ముండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. కథ స్క్రీన్ ప్లే చాలా గమ్మత్తుగా ఉంటాయి. అదే విధంగా సెకండ్ హాఫ్ లో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి గురించి చెప్పే మాటలు థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించాయి. అదే విధంగా చందు ముండేటి చూపించిన విజువల్స్ కూడా బాగా హైలైట్ అయ్యాయి. శ్రీకృష్ణుడు చెప్పిన సిద్ధాంతాలు ప్రస్తుత మానవాళికి ఎలా ఉపయోగపడతాయి అనే కోణంలో చందు ముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 అవార్డు గెలవడంతో అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ చిత్రంతోనే హీరో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యారు.