హాస్పిటల్ లో తమిళ స్టార్ కమెడియన్ వడివేలు.. ఆందోళనలో అభిమానులు

Published : Dec 24, 2021, 05:10 PM ISTUpdated : Dec 24, 2021, 05:13 PM IST
హాస్పిటల్ లో తమిళ స్టార్ కమెడియన్ వడివేలు.. ఆందోళనలో అభిమానులు

సారాంశం

కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు కరోనా బారిన పడ్డారు. అనారోగ్యానికి గురైన ఆయన.. కోవిడ్  పాజిటీవ్ అని తెలియడంతో.. వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.

 తమిళ   స్టార్ కమెడియన్  వడివేలు కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయకు  పాజిటివ్ అని  తేలింది. వెంటనే ఆయన చెన్నైలోని  రామచంద్రా హాస్పిటల్ లో చేరారు. గత కొంత కాలంగా సినిమాలు తగ్గి ఎక్కువగా బయటకు రావడం లేదు వడివేలు. అయితే రీసెంట్ గా ఆయన 'నాయి శేఖర్ రిటర్న్స్' అనే సినిమాకు లోకేషన్ల, ఆర్టిస్టుల ఎంపిక కోసం వడివేలు ఫారెన్ వెళ్లారు. ఈ సినిమా డైరెక్టర్ సూరజ్, నిర్మాత లైకా ఉమేశ్ లతో కలిసి వడివేలు  లండన్ వెళ్లారు.

 

లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వడివేలు అస్వస్తతకు గురయ్యారు. జ్వరం, దగ్గు , జలుబు లాంటి లక్షణాలు ఉండటంతో.. అనుమానం వచ్చి డాక్టర్ ను సంప్రదించారు స్టార్ కమెడియన్. వారు కూడా కోవిడ్ కోవిడ్ లక్షణాలు ఉన్నాయని కోవిడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పడంతో వడివేలు పరీక్షల్ చేయించుకున్నారు. పాజిటీవ్ అని తేలడంతో రామచంద్ర హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు వడివేలు.

 

అయితే ఇప్పటి వరకూ భయపడవలసిందేమీ లేదని.చాలా ఎర్లీ స్టేజ్ లోనే.. వడివేల హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని.. తమిళ సినీ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటి వరకూ ఎటువంటి కాంప్లికేషన్లు లేవని తెలుస్తుంది. అటు వడివేలు అభిమానులు... హాస్యప్రియులు ఈ విషయం తెలుసుకుని ఆందోళన చేందుతున్నారు. వడివేలు ఆరోగ్యంగా తిరిగి రావాలని వారు కోరుకుంటున్నారు.

Also Read : Kiara Advani : బిగ్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్న కియార అద్వాని..పెళ్లి చేసుకోబోతోందా..?
కోవిడ్ బారి పడిన సెలబ్రెటీలంతా  రామచంద్ర హస్పిటల్ వైపు చూస్తున్నారు. అమర గాయకుడు బాలు కూడా కరోనాతో ఈ హాస్పిట్ లోనే చేరగా.. రీసెంట్ గా కరోనా బారిన పడిన లోకనాయకుడు కమల హాసన్ కూడా నవంబర్ 22న ఇదే రామచంద్రా ఆసుపత్రిలో అడ్మిట్ అయి కోలుకున్నారు. మరో కోలీవుడ్ స్టార్ సీనియర్  హీరో విక్రమ్ కూడా కరోనా బారిన పడి రీసెంట్ గా కోలుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌