కమెడియన్ గా సునీల్ రీఎంట్రీ

Published : Sep 14, 2017, 08:01 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
కమెడియన్ గా సునీల్ రీఎంట్రీ

సారాంశం

టాలీవుడ్ లో హిరోగా సెట్ అయిన క‌మెడియ‌న్ సునీల్  హిరోగా న‌టించిన త‌రువాత క‌మెడియ‌న్ క్యారెక్ట‌ర్ కి దూరంగా ఉంటున్న సునీల్ తాజాగా త్రివిక్ర‌మ్ మూవీతో క‌మెడియ‌న్ గా రి ఎంట్రి ఇస్తున్న సునీల్ 

 

సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఒకే రూమ్ లో జీవితాన్ని గడిపి సినిమా అవకాశాల కోసం ఎంతో ఎదురుచూసిన వారు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియ సునీల్. ఈ విషయం అందరికి తెలిసిందే అయితే  త్రివిక్రమ్ రచయితగా సెట్ అయిన తర్వాత ఆయన రాసిన ప్రతి కథలో సునీల్ కోసం ఎదో ఒక క్యారెక్టర్ ను క్రియేట్ చేసేవాడు. త్రివిక్రమ్ దర్శకుడిగా మారాక ఇక ఆయన సినిమాలు ద్వారా సునీల్ టాప్ కమెడియన్ లిస్ట్ లో చేరిపోయాడు. కానీ సునీల్ హీరోగా మారిన తర్వాత కమెడియన్ పాత్రలకు పులిస్టాప్ పెట్టేసిన సంగతి తెల్సిందే. 

కానీ హీరోగా కాస్త ఇబ్బందులే పడుతున్నాడు.ఆ తర్వాత త్రివిక్రమ్ కూడా సునీల్ ని పట్టించుకోవడం మనేసాడని వార్తలు వచ్చాయి. దీంతో త్రివిక్రమ్ కూడా సునీల్ కెరీర్ ను మళ్ళీ వేరేగా మార్చకుండా ఉండడానికే అతన్ని సినిమాల్లో తీసుకోలేదని సమాధానాన్ని ఇచ్చాడు. అయితే రీసెంట్ గా సునీల్ మళ్ళీ కమెడియన్ గా సినిమాలు చెయ్యాలని నిర్ణయం తీసేసుకున్నాడు.

 అయితే ఈ నిర్ణయం సునీల్ ఎప్పుడో తీసుకున్నాడు కాని ఇతర సినిమాల్లో కమెడియన్ గా నటిస్తే సునీల్ తో సినిమాలను తెరకెక్కించే నిర్మాతలు ఒప్పుకోలేదట. చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాలో సునీల్ ని నటించమని అడిగారట కానీ నిర్మాతల కారణంగానే అతను ఒప్పుకోలేదు.ఇక ఇప్పటినుండి తనతో సినిమాలు తీయలనుకునే నిర్మాతలకు.. కమెడియన్ గా ఛాన్సులు వస్తే చేస్తానంటూ ఒక కండిషన్ ను పెట్టే సినిమాను సైన్ చేస్తానంటున్నాడు. 

ముఖ్యంగా కామెడీ పాత్రలు ఎక్కువగా వేయాలని నిర్ణయించుకున్నానని హీరోగా నటిస్తుంటే ప్రేక్షకులకు నాకు మధ్య గ్యాప్ ఎక్కువగా వస్తోంది అని చెబుతూ..రెగ్యులర్ గా తెరపై కనిపించట్లేదని అన్నాడు. అందుకే హీరోగా నటిస్తూనే మరోవైపు కామెడీ పాత్రలు కూడా చేయడం గ్యారెంటీ అని సునీల్ ఫిక్స్ అయిపోయాడు. అయితే సునీల్ మళ్ళీ త్రివిక్రమ్ సినిమాలో కామెడీ పాత్రలతో తప్పకుండా అలరిస్తాడాని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 అయితే ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మొదటిసారి తెరకెక్కించబోయే ఒక సినిమాలో సునీల్ కామెడీ రోల్ ఉంటుందేమో చూడాలి. ఓ విధంగా చెప్పాలంటే.. అది కమెడియన్ గా సునీల్ రీఎంట్రీ అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు