చెన్నైలో ప్రకాష్ రాజ్ మాజీ భార్య లలిత కోడలు మిస్సింగ్

Published : Sep 14, 2017, 01:19 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
చెన్నైలో ప్రకాష్ రాజ్ మాజీ భార్య లలిత కోడలు మిస్సింగ్

సారాంశం

చెన్నైలో శాంతి శ్రీహరి(డిస్కో శాంతి) మేన కోడలు అబ్రినా మిస్సింగ్ అబ్రినా ప్రకాష్ రాజ్ మాజీ భార్య లలిత కుమారికీ కోడలు సోమవారం నుంచి కనపడకుండా పోయిన అబ్రీనా

దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి బంధువు చెన్నైలో అదృశ్యం కావడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది . శ్రీహరి భార్య శాంతికి,విల7ణ నటుడు ప్రకాష్ రాజ్ మాజీ భార్య లలితా కుమారికి మేనకోడలు అవుతుంది అదృశ్యమైన అబ్రిన్ (17). శాంతి సోదరుడు అరుణ్ మొలివర్మన్ చెన్నై లో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు . అతడి కూతురే అబ్రిన్. అంటే శాంతి శ్రీహరి కి మేనకోడలు. టి నగర్ లో ఉంటున్న అబ్రిన్ సెప్టెంబర్ 6న పాఠశాల కు వెళ్ళింది. అయితే అప్పట్నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో తెలిసిన బంధు మిత్రుల ఇళ్లలో వాకబు చేసారు కానీ అబ్రిన్ జాడ తెలియకపోవడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు.

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . విచిత్రం ఏంటంటే పాఠశాల ఆవరణలో మొత్తం యాభై సిసి కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడంతో పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్ గా మారింది. యుక్త వయసుకి వచ్చిన అమ్మాయి కావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..