పవన్ ఏ అన్నం తింటున్నాడో..? కమెడియన్ పృధ్వీ సంచలన కామెంట్స్!

Published : Nov 21, 2018, 03:32 PM IST
పవన్ ఏ అన్నం తింటున్నాడో..? కమెడియన్ పృధ్వీ సంచలన  కామెంట్స్!

సారాంశం

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో పెద్దగా రాణించలేదని అంటున్నారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ. కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించిన ఆయన వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో పెద్దగా రాణించలేదని అంటున్నారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ. కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించిన ఆయన వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏం అన్నం తింటున్నాడో.. చెప్పలేకపోవచ్చు కానీ జనసేన హవా ఎలా ఉందో మాత్రం లెక్కగట్టగలనని అంటున్నారు పృధ్వీ. ఎన్నో ప్రాంతాలు తిరిగి జనాలతో ఉండడం వలన తను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు వెల్లడించారు.

''పవన్ కళ్యాణ్ వాదనలు ఆయనకున్నాయి. అవన్నీ ప్రజలకు నచ్చుతాయని నేను అనుకోవడం లేదు. నేను కూడా స్టేజ్ ఎక్కిన తరువాత వంద మాట్లాడతాను. పవన్ కూడా అంతే.. అవన్నీ వినే ఓపిక జనాలకు లేదు. ఆయనకు ఓ పార్టీ ఉంది, ఎజెండా ఉంది, మేనిఫెస్టో ఉంది. చూద్దాం ఆయన హవా ఎలా ఉంటుందో.. అదంతా జనాలు తేలుస్తారు'' అంటూ వెల్లడించారు.

అలానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా జనసేనకి పడదని, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు వైసీపీని ఆరాదిస్తున్నారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ని చూడడం కోసం మాత్రం జనాలు వస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. కాపు వర్గం ఓట్లు పవన్ కే పడతాయనే విషయంలో నిజం లేదని పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.   
 

PREV
click me!

Recommended Stories

Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్
చిరంజీవితో కలిసి 15 చిత్రాల్లో నటించింది.. కానీ చుక్కలు చూపించింది.! ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే