ఎన్టీఆర్ బయోపిక్.. గ్రాండ్ గా ఆడియో రిలీజ్!

By Prashanth MFirst Published Nov 21, 2018, 3:08 PM IST
Highlights

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రోజుకో న్యూస్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో వివిధ రకాల రూపాల్లో కనిపించనున్నారు. మొదటి భాగం కథానాయకుడు చిత్రీకరణ దాదాపు చివరి దశకు వచ్చేసింది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రోజుకో న్యూస్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో వివిధ రకాల రూపాల్లో కనిపించనున్నారు. మొదటి భాగం కథానాయకుడు చిత్రీకరణ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇక అప్పుడపుడు పోస్టర్స్ తో సినిమాపై అంచనాలను పెంచుతున్న చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ డోస్ పెంచాలని అనుకుంటోంది. 

ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 16న తిరుపతిలో నిర్వహించే ఆ ఈవెంట్ కు రాజకీయ ప్రముఖుల్ని అలాగే ఇతర ప్రముఖ సినీ నటులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించాలని అనుకుంటున్నారు. అందుకోసం నిర్మాత సాయి కొర్రపాటి సన్నాహకాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వేదికకు సంబందించిన ప్లాన్స్ ముగిసినట్లు తెలుస్తోంది. 

సినిమాకు సంబందించిన స్పెషల్ టీజర్ ను కూడా అప్పుడే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఫస్ట్ పార్ట్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి సెకండ్ పార్ట్ మిగిలిన కొన్ని సన్నివేశాలపై దర్శకుడు క్రిష్ కసరత్తులు చేయనున్నారు. ఎమ్ఎమ్.కీరవాణి సంగీతం అందించనున్న ఈ సినిమాలో విద్య బాలన్ - సుమంత్ - నిత్యా మీనన్ - రకుల్ ప్రీత్ తదితరులు నటిస్తున్నారు. 

click me!