పెళ్లి కోసం స్టార్ కొరియోగ్రాఫర్ ని వాడేస్తున్నారు!

Published : Nov 21, 2018, 03:26 PM ISTUpdated : Nov 21, 2018, 03:41 PM IST
పెళ్లి కోసం స్టార్ కొరియోగ్రాఫర్ ని వాడేస్తున్నారు!

సారాంశం

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ రణ్ వీర్ సింగ్ - దీపిక పదుకొనె సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి చూపు మరో స్టార్ కపుల్స్ పై పడింది.

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ రణ్ వీర్ సింగ్ - దీపిక పదుకొనె సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి చూపు మరో స్టార్ కపుల్స్ పై పడింది. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా - హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనస్ మరికొన్ని రోజుల్లో పెళ్లి బంధంతో మరింత దగ్గరకానున్నారు. 

ఇకపోతే వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 -29న సంగీత్ - మెహందీ వేడుకలు జరగనున్నాయి. అయితే సంగీత్ కోసం ప్రియాంక ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ హెగ్డేను నియమించుకుంది. కుటుంబ సబ్యులకు అలాగే తనకు స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్ నేర్పించాలని ముందే మాట్లాడేసుకుంది.  

రణ్ వీర్ - దీపిక మాదిరిగానే ఈ జంట రెండు సార్లు వివాహం చేసుకోబోతున్నారు. జోధ్ పుర్ వేదికగా ప్రియాంక పంజాబీ స్టైల్ లో వివాహం చేసుకోనుంది. ఇక నిక్ అమెరికన్ క్రిస్టియన్ స్టైల్ లో గ్రాండ్ గా వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2 Day 1 Collection: బాక్సాఫీసు వద్ద ధురంధర్‌ 2 సునామీ, అక్కడ ఆల్‌టైమ్ రికార్డ్.. పుష్ప 2ని కొట్టిందా?
మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? సూపర్ స్టార్ ఒక్క యాడ్ ఫిల్మ్ కు ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలుసా ?