క్రేజీ న్యూస్.. బొమ్మరిల్లు భాస్కర్‌తో సిద్దూ జొన్నలగడ్డ.. నిజమెంత..?

Published : Aug 08, 2023, 09:13 PM IST
క్రేజీ న్యూస్..  బొమ్మరిల్లు భాస్కర్‌తో సిద్దూ జొన్నలగడ్డ.. నిజమెంత..?

సారాంశం

కొన్ని క్రేజీ కాంబినేషన్లు అనుకోకుండా తెరపైకి వస్తుంటాయి. అకస్మాత్తుగా ఆడియన్స్ కు షాకిస్తుంటాయి. అటువంటి కాంబినేషన్ ఒకటి త్వరలో టాలీవుడ్ లో సందడి చేయబోతునట్టు తెలుస్తోంది. 

టాలీవీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా... కెరీర్‌ స్టార్ట్‌ చేశాడు సిద్దూ జొన్నలగడ్డ. జోష్ సినిమాతో పాటు..  ఆరెంజ్‌ సినిమాలో  కనిపించి జనాలకు కాస్త రిజిస్టర్ అయ్యాడు సిద్దు.  ఆతరువాత తనకు ఏ సినిమా కలిసి రాలేదు. దాంతో తానే రైటర్ గా మారి.. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో .. గుంటూరు టాకీస్‌ సినిమా చేశాడు. ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు.. సిద్దుకు రొమాంటిక్ హీరో ఇమేజ్ ను కూడా తీసుకువచ్చింది. ఈసినిమా తరువాత సిద్దుకు లాక్‌ డౌన్‌ టైమ్‌లో వచ్చిన కృష్ణ అండ్‌ ఈజ్‌ లీలా మాత్రం కాస్త క్రేజ్‌ తెచ్చిపెట్టింది.

ఈ సినిమాకు కూడా రైటర్‌ ఆయనే. ఈ సినిమా తర్వాత జనాలకు సిద్దూ పేరు బాగానే రిజస్టర్‌ అయింది. ఆ తర్వాత వచ్చిన మా వింత గాధ వినుమా కూడా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక సిద్దరు కెరీర్ ను భారీ టర్న్ తిప్పిన సినిమా మాత్రం  డీజే టిల్లు నే. ఈసినిమా సిద్దూకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న రాని గుర్తింపు డీజే టిల్లు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో సిద్దు జొన్నల గడ్డకు యూత్ లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆసినిమాకు సీక్వెన్ ను చేస్తూ.. అంతకు మించిన క్రేజ్ కోసం చూస్తున్నాడు సిద్దు. ఈసీక్వెల్ తరువాత సిద్దు ఏం సినిమా చేస్తాడా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఈక్రమంల్ సిద్దూ జొన్నలగడ్డ తో క్రేజీ కాంబినేషన్ పేరు వినిపిస్తోంది. సిద్దుతో బొమ్మరిల్లు ఫేమ్.. భాస్కర్ టచ్ లోకి వచ్చాడట. సిద్దుతో సినిమా చేయాలని చూస్తున్నాడట. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఆరేంజ్ సినిమాలో ఓ చిన్న పాత్ర చేసిన సిద్దు.. ఇప్పుడు భాస్కర్ డైరెక్షన్ లో హీరోగా చేయడం అంటే క్రేజీ అనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్‌తో సిద్దూ నెక్స్ట్‌ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్టే అంటున్నారు. అంతేకాదు ఆగస్టు 10న ఈ సినిమాకు సంబంధించిన పూజా కూడా జరుగుతుందని టాక్. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. టాలీవుడ్ లో మాత్రం ఈ వార్త గట్టిగా తిరిగేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?