తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

‘దయ’గా లీడ్ రోల్ లో జేడీ చక్రవర్తి!‌ థ్రిల్లింగ్ కాన్సెప్టు తో...

Surya Prakash | Published : Jun 4, 2023 12:22 PM

జేడీ చక్రవర్తి లీడ్ రోల్ పోషిస్తుండగా రీసెంట్‌గా ‘దయ’ టైటిల్‌ ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. 

 విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి( JD Chakravarthy) కు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.  రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘శివ’ సినిమాతో సినీ జర్నీ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన జేడీ చక్రవర్తి.. నటుడిగా, విలన్‌గా, హీరోగా పలు వైవిద్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించిన ఆయన ఈ మధ్యన కాస్త తక్కువగానే కనపడుతున్నారు. ”మనీ, రక్షణ, వన్ బై టూ, అనగనగా ఒక రోజు, గులాబీ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, సత్య, ప్రేమకు వేళాయెరా” లాంటి సినిమాలతో తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జేడీ చక్రవర్తి. ఒకానొక సమయంలో హీరోగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన తాజాగా దయ అనే   అనే థ్రిల్లర్ వెబ్ సీరిస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నారు.  

తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్   ఆకట్టుకుంటోంది.   ఫస్ట్ లుక్ పోస్టర్  లో జేడీ డీప్ ఆలోచిస్తూ ఉన్నారు.  ఈ టైటిల్‌కు ‘ఫీల్ ద రేజ్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Disney+Hotstar) స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ వెబ్ సిరీస్‌కు పవన్ సాదినేని (Pawan Sadineni) దర్శకుడు. తన ఇదివరకు ‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి’ వంటి  చిత్రాలకు దర్శకత్వం వహించారు. సేనాపతి చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఈ సీరిస్ చాలా వచ్చిందని వినపడుతోంది. మేకింగ్, ఎడిటింగ్ పరంగా తెలుగు వెబ్ సీరిస్ లలో ఇదో ట్రెండ్ సెట్టర్ గా మారబోతోందని చెప్తున్నారు. ఇదో థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎవరూ తీసుకోని ఓ కొత్త పాయింట్ తో ఆద్యంతం థ్రిల్లింగ్ గా నడిచే కొన్ని ట్విస్ట్ లతో ఈ సీరిస్ నడవబోతోంది.

‘దయ’ వెబ్ సిరీస్‌లో ఈషా రెబ్బా (Eesha Rebba), రమ్య నంబేసన్, కమల్ కామరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు ఇందులో జెడీ 2.0ని చూస్తారని ప్రేక్షకులకు హామీ ఇచ్చాడు దర్శకుడు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో  నటుడిగా వెలుగొందుతున్న జేడీ చక్రవర్తి ప్రస్తుతం తెలుగు పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో డిఫరెంట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు. హిందీలో ఏక్ విలన్ పార్ట్- 2, ఆయుష్మాన్ ఖురానాతో కొత్త సినిమా, దహినితో పాటు మరో థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. సోని, ప్రైమ్ కలిసి నిర్మిస్తున్న ఓ హిందీ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. 

click me!