
రాశి ఖన్నా ఇటీవల చెన్నైలోని విట్(VIT) కాలేజీకి అతిధిగా వెళ్లారు. ఆ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్ కి హాజరయ్యారు. రాశి ఖన్నాను చూసేందుకు స్టూడెంట్స్ ఎగబడ్డారు. ఆమె మాటలకు ఉత్సాహంతో ఉరకలు వేశారు. రాశి... రాశి అంటూ నినాదాలు చేశారు. రాశి నామస్మరణతో కాలేజ్ క్యాంపస్ హోరెత్తిపోయింది. ఇక వేదికపై రాశి తన ఎనర్జీతో ఈవెంట్ జోష్ ఫుల్ గా మార్చేశారు. రాశి స్వయంగా పాట పాడారు. తనతో పాటు స్టూడెంట్స్ కలిసి పాడారు.
ఈ వీడియో రాశి సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాశి గత రెండేళ్లుగా తమిళంలో ఎక్కువగా చిత్రాలు చేస్తున్నారు. దీంతో ఆమెకు కోలీవుడ్ లో ఫేమ్ పెరిగింది. ఈ క్రమంలో తమ కాలేజ్ కి అతిథిగా వచ్చిన రాశిని చూసి కుర్రాళ్ళు క్రేజీగా ఫీల్ అయ్యారు. ఆమెకు ఘన స్వాగతం పలికారు.
కాగా రాశి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఫార్జీ భారీ ఆదరణ దక్కించుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ క్రైమ్ సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించారు. రాశి ఫేక్ కరెన్సీ కనిపెట్టడంలో ఎక్స్పర్ట్ అయిన ఆర్బీఐ ఎంప్లాయ రోల్ చేశారు. కాగా ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో ఆఫర్స్ తగ్గాయి. రాశి చేతిలో ఉన్న ఒకే ఒక చిత్రం యోధ. ఈ బాలీవుడ్ మూవీలో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు.
తెలుగులో రాశి నటించిన గత రెండు చిత్రాలు పక్కా కమర్షియల్, థాంక్యూ ఘోరపరాజయం చవిచూశాయి. టాలీవుడ్ లో రాశి మళ్ళీ కనిపించడం కష్టమే. అయితే తెలుగు, తమిళ భాషల్లో కొన్ని కథలు విన్నానని రాశి చెప్పడం విశేషం. మరో చూడాలి రాశి ఖన్నా ఫేట్ ఎలా ఉందో...