జీవితంలోని పెద్ద ప్రమాదాన్ని బయటెపట్టిన నభా నటేష్‌.. ప్రాణాలతో ఉంటానని అనుకోలేదంటూ బాంబ్‌..

Published : Mar 05, 2023, 06:04 PM IST
జీవితంలోని పెద్ద ప్రమాదాన్ని బయటెపట్టిన నభా నటేష్‌.. ప్రాణాలతో ఉంటానని అనుకోలేదంటూ బాంబ్‌..

సారాంశం

ఆ మధ్య నభా నటేష్‌ ప్రమాదానికి గురైనట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించింది నభా నటేష్‌. ప్రమాదం గురించి, తక్కువగా సినిమాలు చేయడానికి కారణాలను వెల్లడించింది. 

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌  ఒక్కసారిగా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది. `ఇస్మార్ట్ శంకర్‌` మూవీ ఈ బ్యూటీకి పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో నభా కెరీర్‌ సాగటం లేదు. ఇదిలా ఉంటే ఆ మధ్య నభా నటేష్‌ ప్రమాదానికి గురైనట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించింది నభా నటేష్‌. ప్రమాదం గురించి, తక్కువగా సినిమాలు చేయడానికి కారణాలను వెల్లడించింది. 

నభా ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటించిందట. అవి త్వరలోనే విడుదల కానున్నాయని తెలిపింది. అయితే కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు, సెలక్టీవ్‌గా వెళ్తున్నట్టు తెలిపింది. తన పాత్రకి, బలమైన కథలకు ప్రయారిటీ ఇస్తున్నట్టు చెప్పింది. అందుకే సినిమాల పరంగా తనకు గ్యాప్‌ వచ్చిందని పేర్కొంది నభా నటేష్‌. ఇటీవల కొత్త సినిమాలకు గ్యాప్‌ రావడానికి కూడా అదే కారణమని స్పష్టం చేసింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ. 

తనకు జరిగిన ప్రమాదం గురించి చెబుతూ, తనకు గతంలో రోడ్డు ప్రమాదం జరిగిందట. దాన్నుంచి కోలుకోవడానికి ఏడాది టైమ్‌ పట్టిందని చెప్పింది. ప్రస్తుతం అంతా బాగానే ఉన్నానని, ఆల్మోస్ట్ కోలుకున్నట్టు చెప్పింది. అయితే ప్రమాదం సమయంలో చనిపోతానేమో అన్న భయం కూడా వేసిందట. రోడ్డు ప్రమాదం జరిగిన చాలా రోజులకు నేను దాని గురించి చెప్పాను, నా భుజం ఎముక విరిగింది. దానికి చాలా ఆపరేషన్స్ చేయాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డాను, కానీ మన జీవితంలో అలాంటి ఘటనలు కొన్ని జరిగినప్పుడే మనల్ని ఎంత మంది ఇష్టపడుతున్నారో తెలుస్ఉంది. నేను ఇప్పుడు శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నా` అని చెప్పింది నభా నటేష్‌. 

ప్రమాదం కారణంగా తాను చాలా సినిమా ఆఫర్లనే మిస్‌ అయ్యిందట. దానిపై నభా చెబుతూ, ప్రమాదం కారణంగా చాలా మంది అవకాశాలు కోల్పోయాను. అయితే వాటి గురించి బాధ పడలేదని, ఎందుకంటే ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండటమే అన్నింటికంటే ముఖ్యమని తెలిపింది. గతంలో సోషల్‌ మీడియాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేదాన్ని అని,ఇప్పుడు దానికి చివరి ప్రయారిటీ ఇచ్చానని చెప్పింది నభా. అందులో కామెంట్లని అస్సలు పట్టించుకోవడం లేదని, ఈ ప్రమాదం తనని ఎంతో మార్చిందని పేర్కొంది నభా నటేష్‌. 

2018లో `నన్ను దోచుకుందువటే` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్‌. సుధీర్‌బాబుతో కలిసి నటించి మెప్పించింది. రవిబాబు `అదుగో`నూ మెరిసిందీ బ్యూటీ. గ్లామర్‌ విషయంలో అస్సలు తగ్గని ఈ బ్యూటీకి `ఇస్మార్ట్ శంకర్‌` పెద్ద లైఫ్‌ ఇచ్చింది. రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించి, తన ఘాటైన అందాలు, యాక్టింగ్‌తో మెప్పించింది. `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్‌`, `అల్లుడు అదుర్స్`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో మెరిసింది. నిజానికి నభా నటించిన చిత్రాలేమీ బ్యాడ్‌ మూవీస్‌ కావు, అంతటి డిజాస్టర్‌ చిత్రాలు కూడా కావు. ఒక్క అల్లుడు అదుర్స్ తప్ప మిగిలినవి ఫర్వాలేదనిపించాయి.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం