మహేష్ కోసం హాలీవుడ్ యాక్టర్స్ ని దించుతున్న రాజమౌళి?

By Sambi Reddy  |  First Published Mar 5, 2023, 6:00 PM IST

మహేష్-రాజమౌళి చిత్రం ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని సమాచారం. కాగా ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. 
 



ఫస్ట్ టైం మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు రాజమౌళి. స్క్రిప్ట్ కూడా లాక్ చేశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో కథ సిద్ధం చేశారు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కథే ఈ చిత్రం అంటూ రాజమౌళి చెప్పారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా బడ్జెట్ కి రెండింతలు ఉంటుందట. దాదాపు రూ. 1000 కోట్లతో తెరకెక్కిస్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని సమాచారం. మరో మూడు నాలుగు నెలల్లో పట్టాలెక్కే సూచనలు కలవు. 

ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న రాజమౌళి అంతర్జాతీయ ప్రమాణాలతో మహేష్ చిత్రం తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈసారి పూర్తి స్థాయి హాలీవుడ్ చిత్రంగా మహేష్ మూవీ తీర్చిదిద్దనున్నారట. ఈ క్రమంలో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రం కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారట. అలాగే కొన్ని సన్నివేశాలు, పాత్రల కోసం హాలీవుడ్ నటులను సంప్రదిస్తున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. 

Latest Videos

మరి అదే నిజమైతే రాజమౌళి అతిపెద్ద విజువల్ వండర్ అభిమానుల కోసం సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రంలో మహేష్ కి జంటగా దీపికా పదుకొనె నటించే అవకాశం కలదంటున్నారు. మరోవైపు మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. పది కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ లగ్జరీ హౌస్ సెట్ ఏర్పాటు చేశారు. అక్కడే  సన్నివేశాలు  చిత్రీకరిస్తున్నారు. 

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా... శ్రీలీల మరో కీలక రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు ఇతర కీలక పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ విడుదల కానుంది. 
 

click me!