
మెగామేనల్లుడు సాయి తేజ్ కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయాడు. అయితే ఆ తరువాత అతడి డౌన్ ఫాల్ మొదలైంది. వరుసగా.. ఆరు సినిమాలు ఫ్లాప్ కావడంతో డీలా పడ్డాడు. ఫైనల్ గా దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 'చిత్రలహరి' సినిమాలో నటించాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు ఈ మెగాహీరో.
ఈ సినిమా ట్రైలర్ లు, పాటలు ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది. అక్కడ సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇదొక ఏవరేజ్ సినిమాగా తేల్చేశారు.
ఒకసారి చూడొచ్చని.. సాయి తేజ్ మరో హిట్ కోసం వేచి చూడక తప్పదని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీసి చూపించారని.. ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. తేజు మాత్రం సరికొత్త లుక్ తో తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడని అంటున్నారు.
వెన్నెలకిషోర్, సునీల్ ల కామెడీ బాగా పండిందని టాక్. ఈ సినిమాలో పోసాని క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుందట. సెకండ్ హాఫ్ కూడా బాగుండి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదని చెబుతున్నారు. నేపధ్య సంగీతం బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ట్విట్టర్ లో అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది.