చిత్రలహరి యూఎస్ ప్రీమియర్ షో టాక్

By Prashanth MFirst Published Apr 12, 2019, 6:00 AM IST
Highlights

వరుసగా ఆరు డిజాస్టర్స్ తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుచి వచ్చిన చిత్రం చిత్ర లహరి. ఈ సారి సాయి కమర్షియల్ హంగుల్ని కాస్త పక్కనెట్టి ఏమోషనల్ థాట్ తో ఓ కొత్త ప్రయోగం చేశాడు. నేడు విడుదల కానున్న చిత్రలహరి సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో కొద్దిసేపటి క్రితం ప్రదర్శించారు. ఇక ఆ టాక్ విషయానికి వస్తే..
 

వరుసగా ఆరు డిజాస్టర్స్ తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుచి వచ్చిన చిత్రం చిత్ర లహరి. ఈ సారి సాయి కమర్షియల్ హంగుల్ని కాస్త పక్కనెట్టి ఏమోషనల్ థాట్ తో ఓ కొత్త ప్రయోగం చేశాడు. నేడు విడుదల కానున్న చిత్రలహరి సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో కొద్దిసేపటి క్రితం ప్రదర్శించారు. ఇక ఆ టాక్ విషయానికి వస్తే..

ఈ సినిమా ద్వారా  సాయి ధరమ్ తేజ్ నేమ్ సాయి తేజ్ గా మారింది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా టైటిల్స్ లో సాయి తేజ్ అనే వేశారు. ఇక కథ విషయానికి వస్తే.. సింపుల్ లైన్ అయినప్పటికీ దర్శకుడు ఎమోషన్స్ తో స్క్రీన్ పై కొత్తగా ప్రజెంట్ చేశాడు. కోర్ట్ లో ఒక సీన్ ద్వారా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో సినిమా కథ మొదలవుతుంది. టివి సర్వీస్ సెంటర్ లో వర్క్ చేసే సాయిని బ్యాడ్ లో ఓ రేంజ్ లో వెంటాడుతుంది. ఇక అతను ఐడియాలను ఎవరు పట్టించుకోరు. 

అప్పటికే కల్యాణి ప్రియదర్శినితో సాయి లవ్ లో ఉంటాడు. అయితే అతని బ్యాడ్ లక్ వల్ల ప్రేయసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తరువాత సాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, లైఫ్ లో అపజయాలను చూసే వ్యక్తి ఎలాంటి ఆలోచనలతో ముందుకు సాగాడు అనే పాయింట్స్ దర్శకుడు తెరపై తనదైన శైలిలో ప్రజెంట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే నివేత పేతురాజ్ సాయికి హెల్ప్ చేసే క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఇక సునీల్ ఒక క్రిస్టియన్ సింగర్ పాత్ర చేశాడు. 

ఫస్ట్ హాఫ్ మొదట్లో పాత్రలను పరిచయం చేసిన విధానం బావుంది. కానీ అక్కడక్కడా రొటీన్ సీన్స్ చిరాగ్గా అనిపిస్తాయి. సినిమాలో రొటీన్ కామెడీ డోస్ కూడా ఎక్కువగానే ఉంది. అయితే దర్శకుడు కిషోర్ తిరుమల మార్క్ ఏమోషన్ అయితే పర్ఫెక్ట్ గా క్లిక్ అయ్యిందని చెప్పవచ్చు. ప్రస్తుతం పరుగులు తీసే జీవితాలకు ఎదో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. 

విజయ్ పాత్రలో సాయి లైఫ్ అండ్ లవ్ ఫెయిల్యూర్ క్యారెక్టర్ కి పూర్తిగా న్యాయం చేశాడు. ఇక వెన్నెల కిషోర్ పోసాని కృష్ణ మురళి వంటి పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. ఫైనల్ గా చిత్రలహరి సమ్మర్ లో కొంచెం కూల్ మూవీ అని చెప్పవచ్చు. అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళితే బావుంటుందనే టాక్ వస్తోంది. మరి ఈ సినిమాతో సాయి ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

click me!