'అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌': రెహ్మాన్‌ పాడిన తెలుగు పాట ఇదిగో

By Udaya DFirst Published Apr 11, 2019, 7:12 PM IST
Highlights

అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ సినిమా కోసం సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ కొన్ని బాణీలను సమకూర్చిన సంగతి తెలిసిందే.  

అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ సినిమా కోసం సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ కొన్ని బాణీలను సమకూర్చిన సంగతి తెలిసిందే.  రెహ్మాన్‌.. ఈ హాలీవుడ్‌ ఫిల్మ్‌ కోసం ప్రత్యేకంగా పనిచేయటంతో మనదేశంలోనూ క్రేజ్ వచ్చింది. సూపర్‌ హీరో కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెలలోనే రిలీజ్‌ కానున్నది. 

ఈ నేపధ్యంలో  అభిమానలకు స్పూర్తినిచ్చే ఓ పాటను ఈ సినిమా కోసం రెహ్మాన్‌ పాడారు. ఆ సాంగ్‌ను కేవలం ఇండియా ప్రేక్షకుల కోసమే రూపొందించారు. అయితే ఆ పాటను మొదట తెలుగులో రిలీజ్‌ చేశారు. ఆ పాటను మీరు ఇక్కడ వినచ్చు. చూడచ్చు.

అంతులేని అంతరిక్షమే దాటి అంటూ.. రెహ్మాన్‌ స్వయంగా ఆ పాటను పాడారు. మార్వెల్‌ గేయంగా ఈ పాటను తీర్చిదిద్దారు. ఏప్రిల్‌ 26వ తేదీన ఈ సినిమా రిలీజ్‌కానున్నది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు.  

click me!