కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్. అయితే, కొరటాల శివ టేకింగ్, చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
దర్శకుడు కొరటాల శివ గత రెండేళ్లుగా ఆచార్యతో స్టక్ అయ్యిపోయారు. అయితే ఇంకా ఇరవై రోజుల షూట్ పెండింగ్ ఉంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వెనక్కి తగ్గిన కొరటాల ,చిరంజీవి ఎప్పుడు కోవిడ్ కంట్రోలులోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేసులు మెల్లిగా తగ్గటంతో ఈ జూన్ లోనే షూటింగ్ మొదలెడదామనే ప్లాన్ చేస్తున్నారట కొరటాల. షూటింగ్ ఓ స్పెషల్ సెట్ లో కాబట్టి రిస్క్ ఉండదని కొరటాల భావించి రీసెంట్ గా చిరంజీవిని కొరటాల కలిసి షూట్ మొదలెడదామని ప్రపోజల్ పెట్టారట. చాలా తక్కువ మంది క్రూ మెంబర్స్ తో , జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేద్దామని ప్రపోజల్ పెట్టారట. అయితే చిరంజీవి ఒప్పుకోలేదట. మరో నెల ఆగుదామని అన్నారట. దాంతో కొరటాల శివ బాగా నిరాశపడినట్లు చెప్పుకుంటున్నారు. అంటే జూలై దాకా షూట్ మొదలు కాదన్నమాట.
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా కనిపిస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్. అయితే, కొరటాల శివ టేకింగ్, చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్‌చరణ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ కథనాయిక. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ నేపధ్యంలో చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా అప్పుడే ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలుపెట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అలాగే ‘ఆచార్య’ ఇంకా సెట్స్‌పై ఉండగానే నిర్మాతలు నాన్-థియేట్రికల్ రెవెన్యూ కింద పెద్ద మొత్తంలో అందుకోబోతున్నారని టాక్. అది ఆడియో హక్కుల ద్వారా అని వినపడుతోంది. ‘అల.. వైకుంఠపురములో..’తో కిందటేడాది భారీ విజయాన్ని అందుకోవడంతో కోట్లు గడించిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఇప్పుడు ‘ఆచార్య’ ఆడియో రైట్స్‌ను చేజిక్కించుకుంది అనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా రూ.నాలుగు కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి ‘ఆచార్య’ హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుందట.