
90వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరు సంక్రాంతి బరిలో పందెం కోళ్లుగా ఉండేవారు. నువ్వా నేనా అంటూ బాక్సాఫీస్ ముందు తలపడేవారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి కేంద్రంలో చక్రం తిప్పాక సినిమాల్లో గ్యాప్ తీసుకున్నారు. అయితే 150వ సినిమాతో చిరంజీవి తిరిగి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో పోటీ పడిన బాలయ్య, చిరంజీవిలు తాజాగా ఈ సంక్రాంతి కి మరోసారి పోటీ పడ్డారు.
బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ బరిలో దిగిన చిరంజీవి - బాలకృష్ణలు తమ ఇద్దరి చిత్రాలు సక్సెస్ ఫుల్ గా నడుస్తుండటంతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హీరోలు ఎంచక్కా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంటే... వాళ్ల 0అభిమానులు మాత్రం పోటా పోటీగా ఒకరి పై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
అభిమానుల ఫైట్ అలా ఉంచితే.. బాలయ్య చిరంజీవి గురించి గురించి ఏమన్నాడో తెలుసా... సినిమా రంగంలో తాను తరుచుగా ఎవరినైనా కలిసేది అంటూ ఉంటే అది ఒక్క చిరంజీవి మాత్రమేనని పెద్ద బాంబ్ పేల్చారు. పనులతోనే ఎక్కువగా బిజీ గా ఉంటాను కాబట్టి అందరితో ఎక్కువగా కలవను కానీ చిరంజీవి తో మాత్రం తరుచుగా కలుస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య .
ప్రస్తుతం బాలయ్య బసవరామతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా , హిందూపురం శాసన సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు . దాంతో ఆ వ్యవహారాలతోనే బిజీ గా ఉంటున్నాడు పైగా బాలయ్య ఇతర విషయాల పట్ల అంతగా ప్రాధాన్యత ఇవ్వడు అన్న విషయం కూడా విదితమే . సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన రెండు సినిమాలు మంచి హిట్ దక్కించుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసాడు బాలకృష్ణ