ఓం నమో వెంకటేశాయ ప్రమోషన్ మొదలు పెట్టిన నాగార్జున

Published : Jan 19, 2017, 09:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ఓం నమో వెంకటేశాయ ప్రమోషన్ మొదలు పెట్టిన నాగార్జున

సారాంశం

ఓం నమో వెంకటేశాయ ప్రమోషన్ పనులు ప్రారంభం రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరోసారి భక్తిరస చిత్రంలో నాగార్జున ఫిబ్రవరి 10న విడుదలకు ముస్తాబవుతున్న ఓంనమో వెంకటేశాయ

నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ఓం నమోవేంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వరుని భక్తుడు హాథీరాం బాబాగా నటిస్తున్నాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి సినిమాలు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఓం నమో వేంకటేశాయపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కు ఎక్కువ సమయం లేకపోవటంతో హీరో నాగార్జున ప్రమోషన్ కార్యక్రమాలని ప్రారంభించాడు. వెంకటేశ్వరస్వామి పాత్రధారి సౌరబ్ జైన్ తో కలిసి దిగిన ఓ ఫోటోను తన ట్విటర్ పేజ్ లో పోస్ట్ చేసిన నాగ్, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించాడు.

PREV
click me!

Recommended Stories

Alia Bhatt AI Images: అలియా భట్‌ ఫేక్ ఫోటోలతో పాకిస్థాన్ లో దారుణం, స్టార్స్ కి తలనొప్పిగా AI టెక్నాలజీ..
కొరియా అధ్యక్షుడితో పవన్ కళ్యాణ్ హీరోయిన్.. రాష్ట్రపతి భవన్‌ లో ప్రియాంక మోహన్ డిన్నర్