మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ థియేట్రికల్ రన్ విజయవంతమైంది. ఇక ఓటీటీలోకీ వచ్చేందుకు సిద్ధమవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ థియేట్రికల్ రన్ విజయవంతమైంది. బ్లాక్ బాస్టర్ టాక్ దక్కించుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా తొలిరోజు నుంచే వసూళ్ల వర్షం కురిపించ సాగింది. రీసెంట్ గా ఈ చిత్రం 25 రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
చిరు వింటేజ్ లుక్ లో అలరించడం, మాస్ మహారాజా కీలక పాత్రలో నటించడంతో థియేటర్లలో ఫ్యాన్స్ పరిస్థితి పూనకాలనే చెప్పాలి. దీంతో సినిమాను ఓటీటీలోనూ చూసేందుకు అభిమానులు, ఓటీటీ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు..ఈ క్రమంలో ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈబ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) డేట్ ను అనౌన్స్ చేసింది. ఈనెల (ఫిబ్రవరి 27)నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచబోతున్నట్టు ప్రకటించింది.
ఇప్పటికీ వాల్తేరు వీరయ్య థియేట్రికల్ రిలీజ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ దుమ్ములేపింది. ఇక ఓటీటీలోనూ దూసుకుపోనుందని తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తో పాటు జెమినీ సంస్థలు దక్కించుకున్నారు. రూ.88 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక వాల్తేరు వీరయ్య ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. దాదాపు అన్నీ ఏరియాల్లో మంచి వసూళ్లను సాధించి పెట్టిందీ చిత్రం.
యంగ్ డైరెక్టర్ బాబీ చిరంజీవికి పెద్ధ అభిమాని కావడం.. తన బాస్ ను ఎలా చూపించాలో అలా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంతో ఫ్యాన్స్ థియేటర్లలో ఊగిపోయారు. ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. శృతిహాసన్ కథానాయికగా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
In front there is Mega Force festival! Waltair Veerayya is coming to Netflix on 27th Feb and we can't keep calm🔥🔥🔥 pic.twitter.com/MD0FDSREtB
— Netflix India South (@Netflix_INSouth)