సినిమా జస్ట్ ఏ బిజినెస్ తేల్చేసిన నాగబాబు... దండం పెట్టిన వర్మ!

Published : Feb 07, 2023, 02:29 PM ISTUpdated : Feb 07, 2023, 02:39 PM IST
సినిమా జస్ట్ ఏ బిజినెస్ తేల్చేసిన నాగబాబు... దండం పెట్టిన వర్మ!

సారాంశం

మెగా బ్రదర్ నాగబాబు సినిమాను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ చర్చకు దారితీశాయి. రాజకీయ విమర్శలకు సమాధానంలో భాగంగా నాగబాబు సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ వ్యాపారం మాత్రమే అని స్టేట్మెంట్ ఇచ్చారు. 


ప్రస్తుతం నాగబాబు జనసేన నాయకులు. ఆ పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీని, అధినేత పవన్ కళ్యాణ్ ని ఎవరైనా? ఏదైనా? అంటే స్పందిస్తారు. ప్రత్యర్థుల ఆరోపణలు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. దీనిలో భాగంగా నాగబాబు సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ వ్యాపారం మాత్రమే అన్నారు. సినిమాలో ఏదైనా తప్పు ఉంటే సరి చేయడానికి సెన్సార్ సభ్యులు ఉన్నారు. సినిమా వల్ల జనాలు చెడిపోతున్నారంటే నేను నమ్మను. 

సినిమాల్లో ఉన్న హింస కారణంగా జనాలు చెడిపోతున్నారనేది నిజమైతే, అదే సినిమాల్లో చూపించే మంచి వలన బాగుపడాలి కదా. ఒక నిర్మాతగా నేను చెప్పేది ఏమిటంటే... సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే, జనాలను సమాజాన్ని బాగు చేయడం కోసం కాదు. అంతటి మేధావులు ఎవరూ లేరు. సినిమా కేవలం బిజినెస్ అని ట్వీట్ చేశారు. 

 నాగబాబు వ్యాఖ్యల్లో కొంత నిజం ఉన్నప్పటికీ పూర్తిగా ఆయన కామెంట్స్ ని సమర్ధించలేమని నెటిజెన్స్ వాదన. సినిమా అత్యంత ప్రభావంతమైన మీడియాగా చాలా సందర్భాల్లో రుజువైంది. ఇక సినిమా కేవలం బిజినెస్ అని చెప్పడం సరి కాదంటున్నారు. మీరు అలా నమ్మిన పక్షంలో సినిమా కళామతల్లి, మేము ఆమె ముద్దు బిడ్డలం వంటి డైలాగ్స్ కొట్టకండి, అని సెటైర్స్ వేస్తున్నారు. 


అయితే నాగబాబు వ్యాఖ్యలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్ధించడం విశేషం. మీరు చెప్పింది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటూ రామ్ గోపాల్ వర్మ నాగబాబు ట్వీట్ ని ట్యాగ్ చేసి కామెంట్ చేశారు. కాగా నాగబాబుకి వర్మ అంటే అసలు పడదు. చంద్రబాబుతో కలిస్తే పవన్ కి వెన్నుపోటు తప్పదని వర్మ ట్వీట్స్ వేశారు. వర్మ కామెంట్స్ పై మీ స్పందన ఏమిటని నాగబాబును అడగ్గా... వాడో నీచ్**** అంటూ రాయలేని భాషలో బూతులు తిట్టాడు. అలాంటి నాగబాబు స్టేట్మెంట్ ని వర్మ సమర్ధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే