మహిళలకు `రైటర్‌ పద్మభూషణ్‌` బంపర్‌ ఆఫర్‌.. రేపు అన్ని షోలు ఫ్రీ.. థియేటర్ల లిస్ట్ ఇదే

Published : Feb 07, 2023, 03:48 PM IST
మహిళలకు `రైటర్‌ పద్మభూషణ్‌` బంపర్‌ ఆఫర్‌.. రేపు అన్ని షోలు ఫ్రీ.. థియేటర్ల లిస్ట్ ఇదే

సారాంశం

`ఉమెన్స్ వెడ్‌నస్‌డే` పేరుతో రేపు(బుధవారం) మహిళలకు `రైటర్‌ పద్మభూషణ్‌`  సినిమాని ఫ్రీగా చూపించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు అన్ని షోస్‌ మహిళలకు ఉచితంగా ప్రదర్శించబోతున్నారు.

పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది `రైటర్‌ పద్మభూషణ్‌` మూవీ. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది. కలెక్షన్లు కూడా స్టడీగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌, మంచి కంటెంట్‌తో రూపొందిన సినిమా కావడంతో ఇది ఇప్పుడు మంచి విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ దాటుకుని లాభాల్లోకి వెళ్తుందని టాక్‌.  `కలర్‌ ఫోటో` ఫేమ్‌ సుహాస్‌ ఇందులో హీరోగా నటించడం విశేషం. ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. 

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మొదట్నుంచి విభిన్నంగా చేస్తుంది యూనిట్‌. రిలీజ్‌కి రెండు మూడు రోజుల ముందు నుంచే పలు చోట్ల ముందస్తుగా ప్రీమియర్‌ షోస్‌ వేశారు. వాటికి మంచి స్పందన లభించింది. అది రిలీజ్‌కి మంచి ప్రమోషన్స్ చేసి పెట్టింది. సినిమా సక్సెస్‌కి కారణమయ్యింది. దాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లబోతున్నారు. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు ఐదు కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. వర్కింగ్‌ డేస్‌లోనూ కలెక్షన్లు బాగున్న నేపథ్యంలో ఓ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది యూనిట్‌. మహిళలకు ఫ్రీగా సినిమా చూపించబోతున్నారు. 

`ఉమెన్స్ వెడ్‌నస్‌డే` పేరుతో రేపు(బుధవారం) మహిళలకు ఈ సినిమాని ఫ్రీగా చూపించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు అన్ని షోస్‌ మహిళలకు ఉచితంగా ప్రదర్శించబోతున్నారు. అయితే దానికో కండీషన్‌ ఉంది. ఫ్రీ అనేదానికి కండీషన్స్ ఉన్నట్టుగానే రేపు మహిళలకు ఫ్రీ అనేది కూడా చిన్న కండీషన్‌తో ఉండనుంది. తెలంగాణ, ఏపీలో యూనిట్‌ ఎంపిక చేసిన 38 థియేటర్లలో మహిళలకు రేపు అన్ని షోలు ఉచితంగా ప్రదర్శించనున్నారు. వాటికిగానూ మహిళలకు ప్రత్యేకమైన పాసులు అందజేయనున్నారు. టీమ్‌ ఎంపిక చేసిన థియేటర్లలో మహిళలకు ప్రత్యేక పాసులు అందిస్తారు.

ఈ మహిళలకు కేటాయించే పాసులను తాజాగా స్టార్‌ యాంకర్‌ సుమ విడుదల చేసింది. మంగళవారం `రైటర్‌ పద్మభూషణ్‌` టీమ్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి యాంకర్‌ సుమ గెస్ట్ గా పాల్గొని ఈ ప్రత్యేక పాసులను విడుదల చేశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన మహిళల తమ కోసం టైమ్‌ తీసుకుని ఈ సినిమా చూడాలని తెలిపింది. మహిళలు చూడాల్సిన సినిమా అని తెలిపింది.

ఏఏ థియేటర్లలో అనేది చూస్తే, నైజాంలో-సప్తగిరి, రాజధాని70ఎంఎం, విజేత, పీవీఎన్‌, శ్రీనివాస, తిరుమల, పరమేశ్వరి, వెంకటేశ్వర, సీడెడ్‌లోః వెల్‌రామ్స్, గాయత్రి, ఆనంద్‌ ఎస్‌సీ 4, రమేష్‌. వైజాగ్‌లో-శ్రీకన్య, శ్రీకన్య ఎస్‌సీ2, శిర్డిసాయి, ఎస్వీసీ మల్టీఫ్లెక్స్, ఎస్వీసీ రామలక్ష్మణ్‌, నెల్లూరుః లీలామహల్‌, వెంకటేశ్వర, వెస్ట్ గోదావరిః అంబికా డీలక్స్, ఏవీజీ మల్టీఫ్లక్స్, శ్రీ చిత్రా, లక్ష్మీ నారాయణ ఎస్సీ 2, ఈస్ట్ గోదావరి-గీత అస్పర, పద్మప్రియా, వెంకటరమణ, సప్తగిరి ఎస్‌సీ1, లలితా, రాజవేణి, కృష్ణలో-రాజయువరాజ్‌, శ్రీ కృష్ణ, మిని బొమ్మరిల్లు, గుంటూరులో-వీ ప్లానినో, రవి ప్రియా మాల్‌, శ్రీ లక్ష్మీ, కేఆర్‌ మిని, విజేత వంటి థియేటర్లలో మహిళలకు రేపు ఉచితంగా సినిమాని ప్రదర్శించనున్నారు.  

సుహాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ షణ్ముఖ్‌ దర్శకత్వం వహించగా, టీనా శిల్పరాజ్‌, గౌరి ప్రియా రెడ్డి హీరోయిన్లుగా నటించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?