రామ్ చరణ్ కు నెలరోజులు హాలీడేస్.. మెగా పవర్ స్టార్ ఏం చేయబోతున్నారంటే..?

Published : Feb 18, 2023, 11:46 AM IST
రామ్ చరణ్ కు నెలరోజులు హాలీడేస్.. మెగా పవర్ స్టార్ ఏం చేయబోతున్నారంటే..?

సారాంశం

స్కూల్స్... కాలేజీలకు సెలవులగురించి విన్నాం కాని.. సినిమా హీరోలకు సెలవులేంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెలరోజులు సెలవు తీసుకున్నారట. మరి ఈనెలరోజులు ఆయన ఏంచేయబోతున్నారు.

ఏడాదంతా చదివిన పిల్లలకు సమ్మర్ హాలీడేస్ ఎలాగో.. గ్యాప్ లేకుండా వరుస షూటింగ్స్ తో.. నిర్విరామంగా పనిచేసిన సినిమా హీరోలకు కూడా హాలీడే తీసుకోవాలి కదా..? అందుకే.. చాలా మంది హీరోలు..హీరోయిన్లు షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని.. హ్యాపీగా టూర్లు ప్లాన్ చేసుకుంటారు.. రిలాక్స్అయ్యి వస్తారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ కు అనుకోకుండా నెలరోజులుసెలవులు వచ్చాయట. ఈనెలరోజులు రామ చరణ్ ఏం చేయబోతున్నాడు. టూర్ ప్లాన్ చేస్తాడా..? లేక సినిమా కథలు వింటాడా..? ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాడా..? అని మెగా అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 

అసలు రామ్ చరణ్ ను నెలరోజులు సెలవులు ఎలా వచ్చాయంటే..? Rc15 షూటింగ్ ను నాన్ స్టాప్ గా చేశారు టీమ్. రామ్ చరణ్ రెస్ట్ లెస్ గా పనిచేశారు. హైదరాబాద్ షెడ్యూల్.. ఆతరువాత కర్నూల్ లో కొండారెడ్డి బురుజు దగ్గర.. షూటింగ్ ..అది అయిపోగానే వెంటనే వైజాగ్ లో షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇలా నాన్ స్టాప్ గా షూంటింగ్ చేసుకుంటూ వెళ్లాడు రామ్ చరణ్. ఇక అటు డైరెక్టర్ శంర్ కూడా కమల్ హాసన్ భారతీయుడు2 తో పాటు రామ్ చరణ్ మూవీని రెండు షూటింగ్స్ బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. 

ఈక్రమంలో శంకర్ భారతీయుడు2  కీలక షెడ్యూల్ ను కంప్లీట్ చేయడం కోసం ఆర్సీ15కి బ్రేక్ ఇచ్చాడట. ఇండియన్2 షూటింగ్ లాంగ్ షెడ్యూల్ దాదాపు నెల రోజులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కీలకషెడ్యూల్ కోసం చెన్నై వెళ్లిన శంకర్.. రామ్ చరణ్ సినిమాకు 30 రోజులు గ్యాప్ ఇవ్వక తప్పలేదు. దాంతో రామ్ చరణ్ కు నెలరోజులు సెలవులు వచ్చాయి. ఈక్రమంలో రామ్ చరణ్ ఈ 30 రోజులు ఏం చేయాలి అనేదానిపై 3 ఆప్షన్లు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశాలకువెళ్లే ఛాన్స్ లేదు... ఉపాసన గర్భవతి కావడంతో.. ఇప్పటివరకూ ఆమెతో లాంగ్ టైమ్ స్పెండ్ చేసింది లేదు.దాంతో ఈనెల రోజులు ఆమెతోనే ఉంటాడంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. 

ఇక ఈమధ్యలో చరణ్ ఆస్కార్ వేడులకలకు హాజరు కావాల్సి ఉంది. ఈ వేడుకల కోసం ఎన్నిరోజులు ఫారెన్ వెళ్తారో తెలియాల్సి ఉంది. ఇక ఇవి కాకుండా బుచ్చిబాబు సినిమాకు సబంధించిన డిస్కర్షన్స్ కూడా జరిగే అవకాశం ఉందట. ఈ డిస్కర్షన్స్ కోసం చరణ్ కొన్నిరోజులు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్సీ15 షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోంది. ఇంకొంత షూటింగ్ ఉండటంతో...నెల తరువాత ఒకటీ రెండు షెడ్యూల్స్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలనిచూస్తున్నారట టీమ్. 
 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ