మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు స్పెషల్..

Published : Aug 22, 2018, 12:29 AM ISTUpdated : Sep 09, 2018, 01:11 PM IST
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు స్పెషల్..

సారాంశం

మూడు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదిలిన రూపం మెగాస్టార్ చిరంజీవి. తన నటనతో కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత ఆయన సొంతం. నటనతో పాటు నిర్మాతగా, బిజినెస్ మెన్ గా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ ని సాధించారు.

మూడు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదిలిన రూపం మెగాస్టార్ చిరంజీవి. తన నటనతో కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత ఆయన సొంతం. నటనతో పాటు నిర్మాతగా, బిజినెస్ మెన్ గా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ ని సాధించారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 63 జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.

రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత సినిమాలకు దూరమయిన మెగాస్టార్ తిరిగి సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇచ్చి 'ఖైదీ నెంబర్ 150'తో తన సత్తా చాటాడు. చిరంజీవికి మళ్లీ ఆనాటి వైభవం తిరిగి వస్తుందా? ఇప్పటి తరానికి ఆయన నటన నచ్చుతుందా? ఇలా కొందరికి సందేహాలు కలిగాయి. అయితే ఇవన్నీ మామూలు వాళ్లకి కష్టమైన విషయాలే కానీ మెగాస్టార్ కి కాదని 'ఖైదీ నెంబర్ 150' సినిమా నిరూపించింది. 

'పునాదిరాళ్ళు' చిరు సినీ ప్రస్థానానికి పునాది పడింది.  ఖైదీగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. తెలుగు సినీ ప్రస్థానంలో 'విజేత'గా కొనసాగాడు. మాస్ ప్రేక్షకుల కోసం ఘరానా మొగుడి అవతారం ఎత్తాడు. లంచగొండుల పాలిట ఠాగూర్ గా నిలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటా రెండా.. చిరంజీవి జన్మించిన మొగల్తూరుకి తెలియకపోవచ్చు తాను భవిష్యత్ లో సినీ సంచలనానికి కేంద్రబిందువుగా మారబోతున్నానని, అంజనాదేవీ-వెంకట్రావు దంపతులకు తెలియకపోవచ్చు రేపటి దినం అగ్ర తనయుడు ఓ పెను సంచలనంగా మారబోతున్నాడని..  

63 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ ఆయన అభిమానగణం ఎంతమాత్రం తగ్గలేదు. అసలు హీరోల కటవుట్ లకు పాలాభిషేకాలు మొదలైందే చిరంజీవి సినిమా దగ్గర నుండి. 150 సినిమాలు అందులో 100 కి పైగా కమర్షియల్ హిట్లు, 30 కి పైగా బ్లాక్ బస్టర్లు.. అయినా కేవలం సినిమా కలెక్షన్ల గురించి మాత్రమే మాట్లాడుకునే సాధారణ హీరో కాదతడు. ఇక ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన 'సై రా నరసింహారెడ్డి' సినిమా టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది.

తన కొడుకు రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాతో మరోసారి మెగాభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికీ ఆయనకు సినిమాల పట్ల ఉన్న నిజాయితీ, ఏకాగ్రతని చూస్తూ అభిమానులు గర్వపడుతున్నారు. ఆ కళామతల్లి ముద్దుబిడ్డ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆశిద్ధాం!
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యోని చెప్పుతో కొడతానన్న దీప-శ్రీధర్ అనుమానం-కార్తీక్ కొత్త ప్లాన్
Thalapathy Vijay: గెలుపు తర్వాత విజయ్ ఫస్ట్ రియాక్షన్! మోదీ, రాహుల్ కు దళపతి కౌంటర్ ?