ఫ్లాప్ నుంచి తప్పించుకున్న చిరంజీవి, తారక్

Published : Sep 04, 2017, 02:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఫ్లాప్ నుంచి తప్పించుకున్న చిరంజీవి, తారక్

సారాంశం

బాలయ్యతో పూరీ తెరకెక్కించిన పైసా వసూల్ సినిమాకు ఫ్లాప్ టాక్ గతంలో ఇదే స్టోరీని చిరంజీవి, తారక్ లకు వినిపించిన పూరీ వాళ్లిద్దరూ రిజెక్ట్ చేయటంతో బాలయ్య ఖాతాలోకి పైసా వసూల్

డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు మూటగట్టుకుంటున్నాడు. రిలీజ్ అయిన తొలి రోజు నుంచే పూరీ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటూ.. ఒక మంచి హిట్ కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు పూరీ. రీసెంట్ గా రిలీజైన పైసా వసూల్ మూవీ కూడా పూరీకి పెద్దగా కలిసిరాలేదు.

 

ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో తీయాలని భావించిన పూరీ కథను మెగాస్టార్ కు వినిపించాడు. అయితే వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇక దాంతో... జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఇదే కథ వినిపించాడు పూరీ. కానీ ఎన్టీఆర్ కి కూడ స్క్రిప్ట్ నచ్చలేదని చెప్పేశాడు.

 

ఇక కొన్ని మార్పులు చేసి అదే కథను బాలకృష్ణకు వినిపించాడు పూరీ. దాంతో కథ నచ్చిన బాలయ్య పూరీ కథను ఓకే చేశాడు. ఈ పైసా వసూల్ మూవీలో ఒక్క బాలయ్య నటన తప్ప మిగతతా అంతా రొటీన్. కథ,కథనం అంతా సింపుల్ గా అనిపించేవే. సినిమాపై ఆసక్తి కలగకపోవడంతో నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. దాంతో సినిమా నష్టాల్లోకి వెళ్తోందని తెలుస్తోంది. దీంతో చిరంజీవి, తారక్ ఇధ్దరూ పూరీ కథను రిజెక్ట్ చేసి సరైన నిర్ణయం తీసుకున్నారని, దాంతో ఫ్లాప్ బారిన పడకుండా తప్పించుకున్నారని అనుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌