
బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మధ్య మొదలైన యుద్ధం.. ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. హృతిక్ తనను గాఢంగా ప్రేమించాడని, ఆ తర్వాత మొహం చాటేశాడని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పి సంచలనం సృష్టించిన కంగనా.. అంతటితో ఆగలేదు.హృతిక్ ని సిల్లీ ఎక్స్ గా సంభోదించింది. దీంతో వివాదం మరింత పెద్దదైంది.
ఇదిలా ఉంటే.. కంగనానే తనకు ప్రేమ లేఖలు పంపిందంటూ హృతిక్ తనకు వచ్చిన మొయిల్స్ చూపించాడు. అలా గొడవ ముదిరి పరస్పరం కోర్టు నోటీసులు పంపుకునే దాక వెళ్లింది. ఆ తరువాత ఈ వివాదం సద్దుమణిగింది అనుకున్న తరుణంలో మరోసారి కంగనా కుంపటిని రగిల్చింది.తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హృతిక్ తనకు క్షమాపణలు చెప్పాలంటూ మరోసారి వివాదానికి తెర లేపింది.
దీనికి హృతిక్ మాజీ భార్య సుస్సానే స్పందించారు. కంగానాకు ధీటుగా సమాధానమిచ్చారు. ఇప్పటికీ తన మాజీ భర్తకు తాను అండగా ఉన్నాననే విషయం చెప్పకనే చెప్పారు. హృతిక్ తో కలిసి తాను దిగిన ఓ పోటోను షేర్ చేసింది. దానితో పాటు ‘ఇలాంటి ఆరోపణలు, విషాద గాధలు మంచి మనుషుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవు’ అంటూ ట్వీట్ చేసింది.
గతంలోనూ హృతిక్.. కంగనను ఆలింగనం చేసుకున్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరలైంది. ఈ ఫొటోతో హృతిక్‌పై కంగన మరిన్ని ఆరోపణలు చేసింది. అప్పుడు కూడా సుస్సానే హృతిక్‌కి సపోర్ట్ చేసింది. ఇద్దరూ కలిసి సన్నిహితంగా దిగిన ఫొటోను సుస్సానే సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘ఆ ఫొటోలన్నీ మార్ఫ్ చేసినవి. తప్పుడు వార్తలే ఎక్కువవైరల్ అవుతాయి. ఈ విషయంలో నేను హృతిక్‌కే సపోర్ట్ చేస్తాను’ అనిట్వీట్ చేసింది .
సుస్సానే.. హృతిక్ తో విడిపోయినప్పటికీ.. ఇలా సమర్థించడాన్ని బాలీవుడ్ నటులు ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్ లో రేణు దేశాయి కూడా అంతే.. భర్త పవన్ నుంచి విడిపోయినప్పటికీ.. అతని గురించి గొప్పగానే చెబుతూ ఉంటుంది.