దాసరి బాధ్యతలు చిరంజీవి తీసుకున్నారు- మురళీమోహన్

Published : Jun 28, 2021, 10:53 AM IST
దాసరి బాధ్యతలు చిరంజీవి తీసుకున్నారు- మురళీమోహన్

సారాంశం

చిత్ర పరిశ్రమకు పెద్దన్న ఎవరు అనే విషయంపై స్పందిస్తూ.. గతంలో దాసరి నారాయణరావు గారు పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. నటుల దగ్గర నుండి సాంకేతిక నిపుణుల వరకు.. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేవారు. 


నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ లేటెస్ట్ ఇంటర్వ్యూ వైరల్ కావడం జరిగింది. తాజా ఇంటర్వ్యూలో రాజకీయ, సినీ రంగాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమకు పెద్దన్న ఎవరు అనే విషయంపై స్పందిస్తూ.. గతంలో దాసరి నారాయణరావు గారు పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. నటుల దగ్గర నుండి సాంకేతిక నిపుణుల వరకు.. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేవారు. అలాగే అనేక మంది నటులు, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేసిన మహానుభావుడు అన్నారు. 

ఆయన మరణం తరువాత ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్న తలెత్తింది. నేను ఓసారి చిరంజీవిని కలిసి దాసరి గారి బాధ్యత మీరు తీసుకోవాలని అడిగాను. దానికి ఆయన నేను చేయగలనో లేదో అని సందేహం వ్యక్తం చేశారు. అయితే స్వచ్చందంగా ఆ బాధ్యత తీసుకున్న చిరంజీవి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో పాల్గొంటున్నారని మురళీమోహన్ తెలియజేశారు. 


మురళీమోహన్ చెప్పినట్లు పేద కళాకారుల సంక్షేమం కోసం చిరంజీవి చాలా చేశారు. ఇక గత ఏడాది సంభవించిన కరోనా సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయి ఆకలితో అల్లాడుతున్న పేద కళాకారుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి, వాళ్లకు అండగా నిలుచున్నాడు. ఇటీవల అపోలో హాస్పిటల్స్ సహకారంతో సినీకార్మికుల కోసం ఉచిత కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి