చిత్ర పరిశ్రమలో విషాదం, ప్రముఖ కళా దర్శకుడు కన్నుమూత!

By team teluguFirst Published Jun 28, 2021, 10:27 AM IST
Highlights

60ఏళ్ల అంగముత్తు చాలా కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నై నుంగబాకం ప్రాంతంలో నివాసం ఉంటున్న అంగముత్తు సుదీర్ఘకాలం చిత్ర పరిశ్రమకు సేవ చేశారు. 

ఏడాదిన్నర కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది నటులు, సాంకేతిక నిపుణులు మరణించారు. ఎన్నడూ లేని విధంగా భారీగా చిత్ర ప్రముఖులు వివిధ కారణాలతో ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి ఎక్కువ మంది మరణానికి కారణం అయ్యింది. కాగా కోలీవుడ్ కి చెందిన ఆర్ట్ డైరెక్టర్ అంగముత్తు షణ్ముఖం నిన్న ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 


60ఏళ్ల అంగముత్తు చాలా కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నై నుంగబాకం ప్రాంతంలో నివాసం ఉంటున్న అంగముత్తు సుదీర్ఘకాలం చిత్ర పరిశ్రమకు సేవ చేశారు. దాదాపు 40ఏళ్లు ఆర్ట్ డైరెక్టర్ అనేక చిత్రాలకు ఆయన పని చేయడం జరిగింది. తెలుగులో కూడా స్టార్ హీరోల చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా అంగముత్తు పనిచేశారు. 
 

అంగముత్తు సినీ కళా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు మూడుసార్లు కార్యదర్శిగా పనిచేశారు.  అంగముత్తు షణ్ముఖం మృతికి తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు, దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి తదితరులు సంతాపం తెలిపారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం ఉదయం స్థానిక నుంగంబాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు


 

click me!