ఈషా రెబ్బా భుజానికి గాయం.. కంగారు పడుతున్న ఫ్యాన్స్!

Published : Jun 28, 2021, 09:52 AM IST
ఈషా రెబ్బా భుజానికి గాయం.. కంగారు పడుతున్న ఫ్యాన్స్!

సారాంశం

ఈషా కుడి భుజంపై గాయం అయినట్లు రీసెంట్ ఫొటోస్ ద్వారా తెలుస్తుంది. ఫోటోలలో ఆ గాయం చూసిన ఆమె అభిమానులు కారణం ఏమిటని కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకొని అది నిజంగా గాయమా లేక మరేదైనా సమస్యనా వివరణ ఇస్తే బాగుండు. 

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా సోషల్ మీడియా పోస్ట్ తో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఒంటిపై గాయం కనపడుతుండగా కారణం ఏమిటని కామెంట్స్ పెడుతున్నారు. టాలీవుడ్ లో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈషా రెబ్బాకు ఆశించిన అవకాశాలు రావడం లేదు. కెరీర్ బిగినింగ్ లో ఆమె మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మీడియం బడ్జెట్ చిత్రాలు విజయం సాధించినా, చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రాలేదు. 


క్రైమ్ థ్రిల్లర్ రాగల 24గంటల్లో మూవీలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించారు. 2019లో విడుదలైన ఆ మూవీ కూడా ఈషాకు నిరాశే మిగిల్చింది. ఈ మధ్య నేటిఫ్లిక్స్ యాంథాలజీ సిరీస్ పిట్టకథలు చేశారు ఈషా. నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సిరీస్ అనుకున్నంత పాప్యులర్ కాలేదు. 


ప్రస్తుతం ఆమె తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంతో పాటు రెండు తమిళ చిత్రాలు చేస్తున్నారు. అయితే ఈషా కుడి భుజంపై గాయం అయినట్లు రీసెంట్ ఫొటోస్ ద్వారా తెలుస్తుంది. ఫోటోలలో ఆ గాయం చూసిన ఆమె అభిమానులు కారణం ఏమిటని కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకొని అది నిజంగా గాయమా లేక మరేదైనా సమస్యనా వివరణ ఇస్తే బాగుండు. 
 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం