మహేష్ బాబుకు షాకిచ్చిన విజయ్ దేవరకొండ

Published : Aug 29, 2017, 07:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
మహేష్ బాబుకు షాకిచ్చిన విజయ్ దేవరకొండ

సారాంశం

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ స్టేటస్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా యుఎస్ఏ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న అర్జున్ రెడ్డి ఫస్ట్ వీక్ మహేష్ బాబు బిజినెస్ మెన్ సాధించిన కలెక్షన్స్ కంటే ఎక్కువ

అర్జున్ రెడ్డి సూపర్ సక్సెస్ తో విజయ్ దేవరకొండ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చినా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన బిజినెస్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. యుఎస్ఏలో అర్జున్ రెడ్డి తొలివారం $9,54,769 డాలర్లు వసూలు సాధించింది.

 

యుఎస్ఎలో రోజువారి కలెక్షన్స్ వివరాలు-

 

గురువారం : $194,051
శుక్రవారం : $265,140
శనివారం : $320,996
ఆదివారం : $174,582

------------------------

మొత్తం: $954,769

------------------------

ఇక ఈ కలెక్షన్స్ ను బట్టి చూస్తే మహేష్ బాబు హీరోగా నటించిన బిజినెస్ మెన్ సాధించిన కలెక్షన్స్ $831,895ను అర్జున్ రెడ్డి దాటినట్లేనని, మహేష్ బాబు రికార్డును విజయ్ దేవరకొండ బద్దలు కొట్టాడని సమాచారం అందుతోంది.

ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం అర్జున్ రెడ్డి అతి త్వరలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరనుంది. ఒకవేళ అదే జరిగితే.. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమా అయినా.. మిలియన్ డాలర్లు వసూలు సాధించిన సినిమాగా అర్జున్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించనుంది.

ఇక ఈ వారం రిలీజైన అజిత్ వివేకం, తాప్సీ ఆనందో బ్రహ్మ చిత్రాలకంటే.. అర్జున్ రెడ్డి కలెక్షన్లలో ముందుంది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే