ఓవరైంది.. జబర్దస్త్ అనాథల వివాదంపై అనసూయ రియాక్షన్

Published : Nov 26, 2017, 03:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఓవరైంది.. జబర్దస్త్ అనాథల వివాదంపై అనసూయ రియాక్షన్

సారాంశం

తెలుగు టీవీ షో జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ పై విమర్శలు అనాథలను అవమాన పరిచేలా స్కిట్ వేశారంటూ హెచార్సీలో ఫిర్యాదు కేసు నమోదు చేసి వివాదం చేయటంపై స్పందించిన యాంకర్ అనసూయ జబర్దస్త్ పై కొంచెం ఓవర్ చేస్తున్నారని, భుజాలు తడుముకోవద్దని అనసూయ హితవు

జబర్దస్‌ కామెడీషో పై వస్తోన్న తాజా ఆరోపణల కాంట్రవర్శిపై యాంకర్ అనసూయ స్పందించింది. తాజాగా హైపర్ ఆది చేసిన స్కిట్ అనాథలను కించపరిచేలా ఉందంటూ.. అనాథలు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆ షోకి యాంకర్‌గా వ్యవహరించిన అనసూయ క్షమాపణ చెప్పాలంటూ అనాథ యువతులు డిమాండ్ చేశారు. కాగా ఈ వివాదంపై ఫేస్‌బుక్‌ లైవ్‌లో స్పందిస్తూ.. జబర్దస్త్ షోపై ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారని అంటోంది అనసూయ.



ఆది చేసిన స్కిట్‌లో తప్పేం ఉందో తనకు అర్థం కావడంలేదని ఆ స్కిట్‌ లో ఉన్న పాత్రను ఉద్దేశించి సందర్భానుసారం జోక్ చేసిందే తప్ప అందులో వివాదం చేయాల్సినంత సీన్ ఏం లేదన్నారు. మిమ్మల్ని నవ్వించే వాళ్లని ఏడిపిస్తారా? అనవసర లాజిక్‌లు లాగకుండా జస్ట్ చూసి వదిలేయండి. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయ్. సమాజానికి ఉపయోగపడే విషయాలు గురించి చర్చిస్తే మంచిది.
 

 

ఓవరాల్ ఇండియాలో సింగిల్ సీజన్‌లో ఇంతిలా పాపులర్ అయిన షో జబర్దస్త్ ఒక్కటే. దీన్ని చూసి మనం తెలుగు ప్రేక్షకులు గర్వపడాలని.. వెండి తెరపై బాహుబలికి ఉన్నంత క్రేజ్ బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకు ఉందన్నారామె. అనవసర రాద్దాంతం చేసి క్రియేటివిటీని తొక్కేయొద్దు.

 

స్కిట్‌ను స్కిట్‌లా చూడకుండా వీళ్లను అన్నారని.., వాళ్లను అన్నారని.., మీరెందుకు గుమ్మాడికాయ దొంగల్లా భుజాలు తడుముకుంటారు. ఆ స్కిట్ చూసి నవ్వుకోండి. మిమ్మల్ని నవ్వించే వాళ్లని ఏడిపిస్తారా? అనవసర లాజిక్‌లు లాగకుండా జస్ట్ చూసి వదిలేయండి లేదా  నచ్చకుంటే చూడకండి అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది జబర్దస్త్ యాంకర్ అనసూయ.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే