Chiranjeevi Spiritual tour: 24గంటలు మూడు టెంపుల్స్ సందర్శించిన చిరు..ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్‌.. వీడియో వైరల్‌

Published : Feb 18, 2022, 09:20 PM IST
Chiranjeevi Spiritual tour: 24గంటలు మూడు టెంపుల్స్  సందర్శించిన చిరు..ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్‌.. వీడియో వైరల్‌

సారాంశం

చిరంజీవి ఇటీవల రెండు రాష్ట్రాల్లోని ప్రముఖమైన మూడు దేవాలయాలను సందర్శించుకోవడం విశేషం. ఆ విశేషాలను వీడియో రూపంలో తయారు చేసి అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. 

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ఇటీవల వరుసగా దైవ దర్శనాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆ టూర్‌కి సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేస్తూ కేవలం 24 గంటల్లో ఆయన రెండు  రాష్ట్రాల్లోని ప్రముఖమైన మూడు దేవాలయాలను సందర్శించుకోవడం విశేషం. ఆ విశేషాలను వీడియో రూపంలో తయారు చేసి అభిమానులతో పంచుకున్నారు Chiranjeevi. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. 

ఈ నెల (ఫిబ్రవరి) 12న సాయంత్రం ఏడు గంటలకు చిరంజీవి శంషాబాద్‌ సమీపంలోని `ముంచిత్తల్‌లో కొత్తగా స్థాపించిన రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని(Samatha Murty Statue) సందర్శించారు. తన భార్యసురేఖతో కలిసి సతీ సమేతంగా ఈ సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆశ్రమంలో ఉన్న 108 దివ్య దేశాల దేవాలయాలను కూడా చిరంజీవి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని ఉద్దేశించి ప్రసంగించారు. 

ఆ తర్వాత రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో బస చేసి, 13వ తేదీ ఉదయం ఐదు గంటలకు రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానంలో కేరళాకి బయలు దేరారు. కొచ్చి విమానాశ్రయం నుంచి శబరిమల అయ్యప్ప టెంపుల్‌కి హెలికాప్టర్‌లో వెళ్లారు. ఉదయం గం.10.30 నుంచి 11.30 వరకు శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఈ జర్నీలో చిరు దంపతులకు  ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్‌, ఫీనిక్స్ గోపీల ఫ్యామిలీలు తోడుగా ఉండటం విశేషం. 

అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో హెలికాప్టర్‌లోనే కేరళాలోని గురువయూర్‌ టెంపుల్‌కి వెళ్లారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుని తిరిగి కొచ్చికి వెళ్లిపోయారు. ఆట్నుంచి హైదరాబాద్‌కి సాయంత్రం ఏడు గంటల వరకు చేరుకోవడం విశేషం. ఫుల్‌ బిజీగా చిరంజీవి షెడ్యూల్‌ సాగడం విశేషం. ఈసందర్భంగా చిరంజీవి మై హోం రామేశ్వరరావుకి, అలాగే ఫీనిక్స్ బ్రదర్స్ కి, పూజారులకు చిరంజీవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం చిరు పంచుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

చిరంజీవి ప్రస్తుతం హీరోగా ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఆయన ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. దీంతోపాటు `గాఢ్‌ఫాదర్‌`, `భోళాశంకర్‌`, `మెగా154` చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దీంతోపాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్యతో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. మరోవైపు ఏపీలో టికెట్ల రేట్ల సమస్యని పరిష్కరించడంలో చిరు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?