
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) భార్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తల్లి కొనిదెల సురేఖ ఈ రోజు బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన రామ్ చరణ్ తన తల్లికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న మూవీ ‘ఆచార్య’. ఈ మూవీకి సంబంధించిన రూరల్ లోకేషన్ సెట్ వద్ద తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోను తన అభిమానులతో పంచుకున్నాడు రామ్ చరణ్.
ఈ సందర్బంగా క్యాప్షన్ కూడా యాడ్ చేశాడు. ‘అమ్మ.. నన్ను నీలా ఎవరూ అర్థం చేసుకోలేరు.. జన్మదిన శుభాకాంక్షలు.. ఇలాంటి బర్త్ డేస్ మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ కొంత ఎమోషనల్ అయ్యాడు. ఈ ఫొటోలో చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. కామెంట్లు, లైక్ లతో అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆచార్య మూవీ కస్ట్యూమ్స్ లో చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పుడే ఆచార్య మూవీ కళను ప్రేక్షకులకు చూపిస్తున్నారు.
ఆచార్య మూవీ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా.. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే(Pooja Hegde) సందడి చేయబోతోంది. ఇక ఈమూవీ మూడు రిలీజ్ డేట్లు మార్చుకుని.. ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.