చిరంజీవి అనూహ్య నిర్ణయం, 'మా' క్రమశిక్షణా సంఘ సభ్యత్వానికి రాజీనామా!

By team teluguFirst Published Apr 7, 2021, 9:46 PM IST
Highlights

క్రమశిక్షణా సంఘం నుండి తప్పుకుంటున్నట్లు చిరంజీవి తన రాజీనామా లేఖను 'మా' పాలక వర్గానికి పంపారని సమాచారం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఉన్న సభ్యుల మధ్య తరచుగా వివాదాలు తలెత్తడంతో పాటు, మీడియా సాక్షిగా రచ్చకు ఎక్కారు. 


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన క్రమశిక్షణా సంఘంలో సభ్యుడిగా ఉన్న చిరంజీవి తన సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. క్రమశిక్షణా సంఘం నుండి తప్పుకుంటున్నట్లు చిరంజీవి తన రాజీనామా లేఖను 'మా' పాలక వర్గానికి పంపారని సమాచారం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఉన్న సభ్యుల మధ్య తరచుగా వివాదాలు తలెత్తడంతో పాటు, మీడియా సాక్షిగా రచ్చకు ఎక్కారు. 


'మా' అధ్యక్షుడుగా ఉన్న నరేష్ పై అనేక ఆరోపణలు రావడం జరిగింది. పాలక వర్గంలోని సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. నరేష్ తో తలెత్తిన విభేదాలు కారణంగా రాజశేఖర్ 'మా' డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పరిశ్రమ పెద్దలపై ఫైర్ అయ్యారు. మోహన్ బాబు, చిరంజీవి వేదికపై ఉండగా, వాళ్ళ కళ్ళకు మొక్కి, వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 


రాజశేఖర్ వ్యవహారంతో చిరంజీవి చాలా అసహనానికి గురయ్యారు. ఆ వివాదం జరిగి చాలా కాలం అవుతుండగా, ఇప్పుడు చిరంజీవి తన సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. పెద్దలుగా ఉన్న వారి మాటలు వినకుండా, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ, పరిశ్రమ పరువు తీస్తున్నారని చిరంజీవి నొచ్చుకున్నారన్న మాట వినిపిస్తుంది. ఈ విషయంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. 
 

click me!