సినిమా ఈవెంట్లు అయిపోయాక చిరంజీవి ఇంటికెళ్లి ఏం చేస్తాడో తెలుసా?.. మెగాస్టార్‌ అలా చేయడమేంటి? నిజంగా షాకే

By Aithagoni Raju  |  First Published Aug 25, 2024, 11:19 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి `ఇంద్ర` 175రోజుల ఈవెంట్‌ భారీ స్థాయిలో జరిగింది. ఇందులో తనకు సంబంధించిన ఓ బిగ్గెస్ట్ సీక్రెట్‌ని బయటపెట్టాడు చిరు. 
 


మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవల 69వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఫ్యామిలీ సమక్షంలోనే తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరగడం గమనార్హం. తిరుమల శ్రీవారిని సందర్శించి తన ఫ్యామిలీకే పరిమితమయ్యారు చిరు. అలాగే ఎప్పటికీలాగే ఫ్యాన్స్ ఈవెంట్‌ జరిగింది. ఆయన గురించి తమ అనుభవాలను పంచుకున్నారు.

ఇదిలా ఉంటే మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన,ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ మూవీ `ఇంద్ర`ని రీ రిలీజ్‌ చేశారు. ఈ నెల 22న రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి విశేష స్పందన లభించింది. ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ ఆ సినిమాని ఎగబడి చూడటం విశేషం. ఆ రోజంతా థియేటర్లలో కోలాహల వాతావరణం నెలకొంది. 

Latest Videos

ఈ సందర్భంగా తాజాగా `ఇంద్ర` నిర్మాతలు ఈ మూవీకి సంబంధించిన వీడియోని యూట్యూబ్‌ ద్వారా విడుదల చేసింది. ఇంద్ర పెద్ద హిట్‌ అయి 175 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈనేపథ్యంలో భారీ ఈవెంట్‌ని నిర్వహించారు నిర్మాత అశ్వనీదత్‌. దీనికి అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చారు. దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్ట్ లు ఇలా చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే దీనికి భారీగా ఫ్యాన్స్ తరలివచ్చార. అప్పట్లో చిరంజీవి కి ఉన్న క్రేజ్‌ మామూలు కాదు. `ఇంద్ర` ఈవెంట్‌కి వేలల్లో కాదు, లక్ష్లల్లో జనం వచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారు. భారీ స్థాయిలో ఈవెంట్‌ జరిగింది. అది ఎంతో మందికి పూనకాలు తెప్పించింది. ఎంతో మందికి ఇన్‌స్పైర్‌ చేసింది. ఎంతో మందిని సినిమాల వైపు నడిపించింది. 

అయితే ఈ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ, ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇంతటి అభిమానాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, మీ అభిమానాన్ని ఎలా కొలవాలో కూడా అర్థం కావడం లేదన్నారు. అయితే తనని మీరు ఇంతగా ఆదరిస్తుంటే, ప్రేమిస్తుంటే, మా కంటే గొప్పవాళ్లు ఎవరూ లేరని తాము భావిస్తుంటామని, నిజంగానే హీరోలా ఫీలవుతామని, కానీ ఆ అభిమానం, ప్రేమని ఎప్పుడూ తలకెక్కించుకోనని, అందుకే ఇలాంటి సినిమా ఈవెంట్లు పూర్తయిన తర్వాత ఇంటికెళ్లి నేలపై పడుకుంటానని, ఆ రోజు నేలపైనే నిద్ర పోతానని అలా ఎప్పుడూ తాను డౌన్‌లోనే ఉండాలనే భావనతో అలా చేస్తానని తెలిపారు. 

ఇంతగా ఆదరిస్తున్నారంటే ఆ గొప్పతనం మాది కాదు, మీది. అందుకే మీరు చూపించే ఈ ప్రేమ అభిమానం గుండెల్లో దాచుకుంటాను తప్ప, తలకెక్కంచుకోను. నాకు సినిమాలంటే ప్రేమ, మీరంటే మహా ప్రేమ` అని వెల్లడించారు చిరంజీవి. 12ఏళ్ల నాటి ఈ వీడియోఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. చిరంజీవి స్పీచ్ పూనకాలు తెప్పించేలా ఉండటం విశేషం. చిరంజీవి ఈ సక్సెస్‌కి సీక్రెట్‌కి అదొక కారణమని చెప్పొచ్చు. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండేలా ఆయన ఉండటం విశేషం. 
 

click me!