బాలీవుడ్ స్టార్ మూవీలో శోభిత ధూళిపాళ్ల ఐటెం సాంగ్? సమంత వలె ఆమె కూడా!

By Sambi Reddy  |  First Published Aug 25, 2024, 8:52 PM IST


అక్కినేని వారింటికి కోడలిగా వెళుతున్న శోభిత ధూళిపాళ్ల పెళ్లికి ముందే నాగ చైతన్యకు ఝలక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె నాగ చైతన్య మాజీ భార్య సమంతను ఫాలో అవుతుందట. 
 


నాగ చైతన్య తన లవర్ శోభిత దూళిపాళ్లతో ఏడు అడుగులు వేయనున్నాడు. రెండేళ్లకు పైగా నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారు. వీరు ఫారిన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. డేటింగ్ చేస్తున్నారని కథనాలు వెలువడ్డాయి. నాగ చైతన్య టీమ్, శోభిత ధూళిపాళ్ల ఈ కథనాలను కొట్టి పారేయడం విశేషం. మా మధ్య ఏమీ లేదంటూనే నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఆగస్టు 8న నాగార్జున నివాసంలో శోభిత-నాగ చైతన్యల ఎంగేజ్మెంట్ నిరాడంబరంగా ముగించారు. 

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలలో శోభిత-నాగ చైతన్య పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉంది. అయితే శోభితకు సంబందించిన ఓ వార్త సినిమా వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆమె ఐటెం సాంగ్ చేసే అవకాశం కలదట. బాలీవుడ్ లో డాన్ సక్సెస్ఫుల్ సిరీస్. 2006లో విడుదలైన డాన్ చిత్రంలో షారుక్ నటించాడు. డాన్ 2లో సైతం ఆయనే ప్రధాన పాత్ర చేశారు. 

Latest Videos

త్వరలో డాన్ 3 షూటింగ్ మొదలు కానుందట. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. డాన్ 3లో షారుఖ్ ఖాన్ కి బదులు రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడట. కాగా ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం శోభిత ధూళిపాళ్లను అనుకుంటున్నారట. ఈ మేరకు బీ టౌన్ లో ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది. మరి డాన్ 3 ఆఫర్ శోభిత ఓకే చేసి ఐటెం సాంగ్ చేస్తే... అది అక్కినేని ఫ్యామిలీకి భారీ షాక్ అనడంలో సందేహం లేదు. 

సమంత అక్కినేని ఫ్యామిలీకి నచ్చని అంశాలలో గ్లామర్ రోల్స్ ఒకటి. పెళ్లి తర్వాత ఆమెకు నటించే స్వేచ్ఛను నాగ చైతన్య ఇచ్చాడు. ఆమె బోల్డ్ రోల్స్ చేయడం ఒకింత వారిని నొప్పించింది. శోభిత కూడా అదే చేస్తే ఆమె బాటలో నడిచినట్లు అవుతుంది. బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ అంటే ఏ రేంజ్ లో గ్లామర్ షో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ శోభిత గత చిత్రాల్లో చేసిన బోల్డ్ సీన్స్ వైరల్ చేస్తూ యాంటీ ఫ్యాన్స్ అక్కినేని ఫ్యామిలీ ని ఎద్దేవా చేస్తున్నారు. మరి శోభిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. 

click me!