
తన అభిమానులకు హీరో యష్, `కేజీఎఫ్` అభిమానులకు చిత్ర యూనిట్ బిగ్ షాకిచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. రాఖీ పండుగ సందర్భంగా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. జులైలో విడుదల కావాల్సిన సినిమా కరోనా సెకండ్ వేవ్‌తో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో దీపావళి, క్రిస్మస్ టైమ్‌లో, లేదంటే దసరాకి విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ సినిమా కోసం ఎన్నో ఆశలతో ఉన్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పడం లేదు. సినిమా కోసం మరో ఏడాది ఆగాల్సిన పరిస్థితి నెలకొంది.
`కేజీఎఫ్‌ః ఛాప్టర్2`ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు తాజాగా యూనిట్ అనౌన్స్ చేసింది. మరోవైపు హీరో యష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నేటి అనిశ్చితి పరిస్థితుల కారణంగా తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని, కానీ వాగ్దానం చేసినట్టుగానే ఏప్రిల్ 14న 2022లో థియేటర్లలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు యష్. దీంతో `కేజీఎఫ్` ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు.
యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాష్‌రాజ్, రావు రమేష్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగుదూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం మూడేళ్ల క్రితం వచ్చి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.