బోయపాటి-దానయ్య వివాదం: చరణ్ కి చిరు క్లాస్!

By Udaya DFirst Published Feb 8, 2019, 10:38 AM IST
Highlights

'వినయ విధేయ రామ' సినిమాకు సంబంధించి దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్యల మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే.దీనికి కారణం రామ్ చరణ్ బయ్యర్లకు ఐదు కోట్లు చొప్పున ఇవ్వాలని నిర్మాతను, దర్శకుడిని అడిగాడు. 

'వినయ విధేయ రామ' సినిమాకు సంబంధించి దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్యల మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం రామ్ చరణ్ బయ్యర్లకు ఐదు కోట్లు చొప్పున ఇవ్వాలని నిర్మాతను, దర్శకుడిని అడిగాడు. చరణ్, దానయ్య మొత్తం పది కోట్లు తిరిగి ఇవ్వడానికి రెడీ అయినా.. బోయపాటి దీన్ని వ్యతిరేకించాడు. దీంతో వ్యవహారం ముదిరిపోయింది.

దానయ్య, బోయపాటి ఒకరినొకరు దూషించుకునే వరకూ వెళ్లింది. రామ్ చరణ్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉండడంతో ఇప్పుడు చిరంజీవి, అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 'వినయ విధేయ రామ' సినిమాను యువి క్రియేషన్స్ కి అమ్మడంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించాడు. తిరిగి పదిహేను కోట్లు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా చరణ్ దే.

అయితే ఈ విషయం చిరంజీవి.. రామ్ చరణ్ కి క్లాస్ పీకారట. సినిమా మార్కెట్ విషయాల్లో జోక్యం చేసుకోవడం వలనే ఇదంతా జరిగిందని,  అదే దానయ్య మార్కెట్ చేసుకొని ఉంటే మొత్తం తానే చూసుకునేవాడని చిరు అన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా.. బోయపాటితో ఎలాగైనా డబ్బులు కట్టించాలనేది రెండో విషయం. ఈ బాధ్యతలు చిరు.. అల్లు అరవింద్ కి అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

బోయపాటికి అల్లు అరవింద్ కి మంచి సాన్నిహిత్యం ఉండడంతో ఇప్పుడు ఆయన్ని ఒప్పించే బాధ్యత అల్లు అరవింద్ తీసుకున్నారు. బోయపాటి తీసుకున్న పదిహేను కోట్ల రెమ్యునరేషన్ లో ఐదు కోట్లు తిరిగి ఇవ్వాల్సిందేనని నిర్మాత దానయ్య పట్టుబట్టి ఉన్నాడు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి! 

వివాదం ముదిరింది: లెక్కలు చూపమన్న బోయపాటి

నిర్మాతతో బోయపాటి గొడవ.. ఒకరినొకరు బూతులు తిట్టుకొని..!

 

click me!