ఆ విషయంలో సంపూని మించిపోయిన సప్తగిరి..!

Published : Feb 08, 2019, 10:00 AM IST
ఆ విషయంలో సంపూని మించిపోయిన సప్తగిరి..!

సారాంశం

'హృదయ కాలేయం' సినిమాలో సంపూర్నేష్ చేసిన అతి కామెడీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత కూడా తన సినిమాల్లో అతి పెర్ఫార్మన్స్ చేసి ఆడియన్స్ ని నవ్వించాడు. విసిగిపోయిన ఆడియన్స్ కూడా ఉన్నారనుకోండి.. 

'హృదయ కాలేయం' సినిమాలో సంపూర్నేష్ చేసిన అతి కామెడీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత కూడా తన సినిమాల్లో అతి పెర్ఫార్మన్స్ చేసి ఆడియన్స్ ని నవ్వించాడు. విసిగిపోయిన ఆడియన్స్ కూడా ఉన్నారనుకోండి.. ఇప్పుడు కమెడియన్ సప్తగిరి.. సంపూని మించిన అతి కామెడీ తన సినిమాలో చేస్తున్నాడు.

ఏకంగా నిప్పులు తాగేస్తూ కనిపించాడు. అసలు విషయంలోకి వస్తే.. హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు చేసిన సప్తగిరి ఈసారి 'వజ్ర కవచధర గోవింద' అనే మరో సినిమాలో నటించాడు. టైటిల్ గా ఈ పేరు పెట్టడంలో ఆంతర్యమేంటో తెలియదు కానీ తాజాగా సినిమా తీజార్ ని విడుదల చేశారు.

పెద్ద హీరో మాస్ యాక్షన్ సినిమాల రేంజ్ లో పరిచయ సన్నివేశాలను చూపిస్తూ.. చివరికి హీరో కామెడీ చేస్తూ నిప్పులు తాగడం చూపించారు. టీజర్ మొత్తం సీరియస్ గా చూపించి చివరికి కామెడీ చేయడం చూస్తుంటే ఈసారి కూడా సప్తగిరి కామెడీ హీరోగానే కనిపిస్తాడని తెలుస్తోంది.

అరుణ్ పవార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శివ శివం ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు!

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు