త్వరలో మెగాస్టార్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం

By Prashanth MFirst Published May 12, 2019, 5:23 PM IST
Highlights

ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోటీగా ఇక నుంచి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపించనుంది. అవును చిరంజీవి పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య సంస్థలు మొదలు కానున్నాయి, మెగా తనయుడు రామ్ చరణ్ - మెగా బ్రదర్ నాగబాబు ఆధ్వర్యంలో ఈ సంస్థలు నడవనున్నాయి. 

శ్రీకాకుళం జిల్లాల్లో మొదటి స్కూల్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నర్సరీ నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్స్ తీసుకోనున్నారు. చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ లలో  మెరుగైన విద్యను అందించి పిల్లలకు మంది భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా యాజమాన్యం పనిచేస్తుందట. 

మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే.. మెగా అభిమానుల పిల్లలకి ఈ పాటశాలలో ప్రత్యేకమైన రాయితీలు ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని బ్రాంచ్ లను స్టార్ట్ చేయాలనీ మెగా నిర్వాహకులు టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం.  

click me!