
సినిమాలోనే కాకుండా స్టేజ్ లపై కూడా తన న్యాచురల్ వర్డ్స్ తో మహేష్ ఎట్రాక్ట్ చేస్తుంటాడు. నేడు నిర్వహించిన సక్సెస్ మీట్ లో కూడా మహేష్ గర్వంతో కాలర్ ఎగరేయడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. వేడుకలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఎమోషనల్ గా మాట్లాడిన తరువాత మహేష్ ఆయనను ప్రశంసించారు.
మహేష్ మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వంశీ గారు ఒకమాటన్నారు., నాన్న గారి అభిమానులు, నా అభిమానులు సినిమా చూసిన తరువాత కాలర్ ఎత్తుకొని తీరుగుతారని చెప్పారు. వాళ్లే కాదు.. ఇవాళ నేను కూడా హ్యాపీగా కాలర్ ఎగరేస్తున్నా అని మహేష్ ఎమోషనల్ గా మాట్లాడారు.
మహేష్ మాట్లాడిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఈ డైలాగ్ ని తెగ షేర్ చేసుకుంటున్నారు. ఈ సక్సెస్ మీట్ లో మహేష్ - వంశీ పైడిపల్లితో పాటు చిత్ర నిర్మాతలు అలాగే అల్లరి నరేష్, పోసాని కృష్ణ మురళి వంటి ప్రముఖ టులు పాల్గొన్నారు.