పవన్ మనసులో మహేష్ 'మహర్షి'?

Published : May 12, 2019, 04:52 PM IST
పవన్ మనసులో మహేష్ 'మహర్షి'?

సారాంశం

రైతుల గురించి మంచి సోషల్ మెస్సేజ్ ఉండటంతో ఈ సినిమాపై పలువురు స్టార్స్ స్పెషల్ షోను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ సమ్మర్ లో మహర్షి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సూపర్ స్టార్ 25వ సినిమా కావడంతో సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ ను అందుకుంది. పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. రైతుల గురించి మంచి సోషల్ మెస్సేజ్ ఉండటంతో ఈ సినిమాపై పలువురు స్టార్స్ స్పెషల్ షోను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల సమస్యలపై నిత్యం స్పందించే పవన్ ని మహర్షి సినిమా ఎట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. పలువురి ద్వారా  సినిమా టాక్ గురించి తెలుసుకున్న పవన్ స్పెషల్ షో వేసుకొని మరి సినిమా చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. తనకు నచ్చితే ఎలాంటి సినిమానైనా పవన్ చూసేస్తారు. 

మరి ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాను కూడా పవన్ ఎవరితో కలిసి చూస్తాడో చూడాలి. మహేష్ - పవన్ బయటకు కనిపించరు గాని ఇండస్ట్రీలో ఇద్దరు మంచి స్నేహితులు. అర్జున్ సినిమా రిలీజప్పుడు పైరసీని ఆపేందుకు మహేష్ కృషి చేయగా పవన్ కూడా మహేష్ తో కలిసి మద్దతు పలికారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?