గాడ్ ఫాదర్ ఫైనల్ రిజల్ట్... హిట్టా ఫట్టా?

Published : Oct 27, 2022, 09:52 AM IST
గాడ్ ఫాదర్ ఫైనల్ రిజల్ట్... హిట్టా ఫట్టా?

సారాంశం

బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ మూవీ రన్ ముగిసింది.కొత్త చిత్రాల విడుదలతో దాదాపు అన్ని ఏరియాల్లో గాడ్ ఫాదర్ చిత్రాన్ని తొలగించారు. మరి ఫైనల్ గా గాడ్ ఫాదర్ రిజిస్ట్ ఏంటని పరిశీలిస్తే...   

ఆచార్య మూవీ చిరంజీవికి ఊహించని షాక్ ఇచ్చింది. కమ్ బ్యాక్ తర్వాత చిరంజీవి చేసిన చిత్రాల్లో ఆచార్య  డిజాస్టర్ అయ్యింది. చిరంజీవి సినిమా రెండో రోజే థియేటర్స్ నుండి తీసేయడం ఊహించని పరిణామం. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది. ఆచార్య మూవీ రిజల్ట్ గురించి చిరంజీవి అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆయన్ని ఆచార్య ఫెయిల్యూర్ ఎంతగా  బాధించిందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. 

ఈ క్రమంలో గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ప్రయత్నం చేశారు. అయితే రిజల్ట్ రిపీట్ అయినట్లు ఫైనల్ కలెక్షన్స్ చూస్తే అర్థం అవుతుంది. గాడ్ ఫాదర్ బిజినెస్ తక్కువలో తక్కువ రూ. 80 కోట్లుగా లెక్కగట్టిగా కూడా నష్టమే వచ్చింది. గాడ్ ఫాదర్ లైఫ్ టైం వరల్డ్ వైడ్ షేర్ కేవలం రూ. 55.3 కోట్లుగా ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. 

నైజాం ఏరియాలో రూ.12.3, సీడెడ్ రూ.9.2, ఉత్తరాంధ్ర రూ. 7 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రూ.44.6 కోట్ల షేర్ అందుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 4.7 కోట్లు, ఓవర్సీస్ రూ. 6 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ రూ. 55.3 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఆ లెక్కన గాడ్ ఫాదర్ బయ్యర్లకు నష్టాలు మిగిల్చినట్లే లెక్క. 

గాడ్ ఫాదర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎవరికీ అమ్మలేదు. సొంతగా విడుదల చేశాము. ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు గాడ్ ఫాదర్ చిత్రానికి వచ్చినట్లు ప్రసాద్ వెల్లడించారు. అయితే మేజర్ ఏరియాల్లో గాడ్ ఫాదర్ చిత్రాన్ని బయ్యర్లకు అమ్మినట్లు సమాచారం. మూవీ భారీ సక్సెస్ అని యూనిట్ ప్రకటించినా రియాలిటీలో వసూళ్లు మాత్రం ప్లాప్ అని తేల్చేశాయి. సంక్రాంతికి రానున్న వాల్తేరు వీరయ్యతో అయినా చిరంజీవి సక్సెస్  ఎక్కుతాడేమో చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే