
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం జపాన్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా తాజాగా ప్రకటించిన 50వ శాటర్న్ పురస్కారాల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా ఎంపికైంది. ఆమెరికాకు చెందిన శాటర్న్ అవార్డులను ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఎక్కువగా అవార్డ్స్ ఇస్తుంటుంది. అటువంటిది మన ఇండియన్ మూవీ.. అందులోను తెలుగు సినిమాకు ఈ గౌరం దక్కడంతో ఆర్ఆర్ఆర్ టీమ్ మురిసిపోతోంది.
బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ..ఇలా మూడు విభాగాల్లో అవార్డులకు ఆర్ఆర్ఆర్ సినిమాను నామినేట్ చేశారు.ఇక ఈ సందర్భంగా.. ఈ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ విషయంలో ఆయన స్పందిస్తూ.. మా ఈ సినిమాకి శాటర్న్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. బాహుబలి, ద కన్‌క్లూజన్ సినిమాకు తొలిసారి శాటర్న్ పురస్కారం గెల్చుకున్నాను. ట్రిపుల్ ఆర్ తో రెండో సారి ఈ అవార్డ్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అంతే కాదు జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండటం వల్ల ఈ అవార్డ్ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నాను అన్నారు. అంతే కాదు ఇతర విభాగాల్లో పురస్కారం అందుకున్న విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం రాజమౌళి జపాన్ లో ఉన్నారు. ట్రిపుల్ ఆర్ టీమ్ తో సహా ఆయన అక్కడ బిజీగా ఉన్నారు. జపాన్ లో అక్టోబర్ 21న ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యింది. అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది సినిమా. జపాన్ ప్యాన్స్ అటు తారక్ ను ఇటు రామ్ చరణ్ ను వదిలిపెట్టడంలేదు. అంతలా మన హీరోలకు ఫ్యాన్స్ అయిపోయారు వారు. మరో వైపు ఎన్టీఆర్ జపనీస్ లో మాట్లాడి ఆల్ రెడీ వారి మనసు దోచుకున్నాడు. ఇక రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు వారి ఫ్యామిలీస్ తో జపాన్ పర్యటనలో ఉన్నారు. సినిమా కార్యక్రమాలతో పాటు పర్సనల్ టూర్లు కూడా చూసుకుంటున్నారు. ఇంకొన్ని రోజులు అక్కడే వారు జాలీ ట్రిప్ చేయబోతున్నట్టు సమాచారం.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్రలో కనిపించారు. అలియాభట్, ఒలివియా మోరిస్, హీరోయిన్లు గా నటించిన ఈమూవీలో అజయ్ దేవ్‌గన్, శ్రియాశరణ్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ 1200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది.