#Dilraju: డైరక్టర్ అన్న చిన్న మాట..దిల్ రాజుని భారీగా ఇరికించేసింది

Published : Oct 27, 2022, 08:01 AM IST
#Dilraju: డైరక్టర్ అన్న చిన్న మాట..దిల్ రాజుని భారీగా ఇరికించేసింది

సారాంశం

ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఇది బైలింగ్వెల్ ఆ? లేక తమిళ్ సినిమానా ? అని అడిగారు. ఆ ప్రశ్నకు ఎక్కువ ఆలోచించకుండా ప్రాపర్ తమిళ్ సినిమానే ఏంటి అలా అడుగుతావ్ అన్నట్టుగా వంశీ తమిళ్లో రియాక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూ అంతా తమిళ్ లో జరిగింది.


 సంక్రాంతికి దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ సినిమా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రిలీజ్ విషయంలో దిల్ రాజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సినిమాని బైలింగ్వుల్ సినిమాగా భావిస్తూ రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అప్పుడు థియేటర్స్ సమస్య రాదు.  కానీ ఆ విషయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విస్ట్ ఇచ్చేసి దిల్ రాజుని ఇరుకున పెట్టారు. అసలేం జరిగిందంటే...

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి , తెలుగు నిర్మాత దిల్ రాజు ‘వారసుడు’ అనే సినిమా చేస్తున్నారు. తమిళ్ లో ఈ సినిమాకు వరిసు అనే టైటిల్ తో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో అందరికీ ఓ డౌట్ ఉంది. ఇది తమిళ్ సినిమానా ? లేక బైలింగ్వెల్ సినిమానా ?. తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ వంశీ. తాజాగా తమిళ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు వంశీ పైడి పల్లి. 

ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఇది బైలింగ్వెల్ ఆ? లేక తమిళ్ సినిమానా ? అని అడిగారు. ఆ ప్రశ్నకు ఎక్కువ ఆలోచించకుండా ప్రాపర్ తమిళ్ సినిమానే ఏంటి అలా అడుగుతావ్ అన్నట్టుగా వంశీ తమిళ్లో రియాక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూ అంతా తమిళ్ లో జరిగింది. వంశీ తమిళ్ లో మాట్లాడుతూ సమాధానాలు ఇచ్చాడు. అలాగే విజయ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాడు. ప్రతీ రోజు ముందు రోజు రాత్రి ఇంట్లో సీన్స్ హోం వర్క్ చేసుకుంటాడని , షాట్ పెట్టే ముందు కూడా ప్రిపేర్ అవుతాడని తనలో అది బెస్ట్ క్వాలిటీ అన్నట్టుగా చెప్పాడు. 

ఒక కుటుంబం, అందులో వారసుడు ఇదే బేస్ లైన్, కానీ విజయ్ ఫ్యాన్స్ ఏమేమో కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉంటాయని తెలిపాడు. యాంకర్ సినిమాకు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు అడుగుతుంటే అవన్నీ ఇప్పుడే చెప్తే దిల్ రాజు ఊరుకోరు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఏదేమైనా దర్శకుడే ఇది తమిళ్ సినిమా అంటూ అఫీషియల్ గా చెప్పేశాడు కాబట్టి ‘వారసుడు’ సినిమాను తెలుగులో డబ్బింగ్ సినిమాగానే పరిగణించాలి.  డబ్బింగ్ సినిమా అంటే సంక్రాంతికి థియేటర్స్ విషయంలో ఇబ్బందులు వస్తాయి. 
 
ఓ సారి గతంలోకి వెళ్తే... నాలుగేళ్ల కిందట సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ కాగా.. ఇంకొకటి రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’. ఇది కాక దిల్ రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఎఫ్-2’ సైతం ఆ పండక్కే రిలీజైంది. అయితే వీటికే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టంగా ఉంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ చిత్రం ‘పేట’ సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఐతే ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన ఓ నిర్మాత.. దానికి థియేటర్లు కేటాయించకపోవడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. దిల్ రాజును పరోక్షంగా తీవ్రంగా విమర్శించాడు. 

దీనికి దిల్ రాజు దీటుగానే బదులిచ్చాడు. ‘పేట’ సినిమా లేటుగా సంక్రాంతి రేసులోకి వచ్చిందని.. తెలుగు సినిమాలను కాదని అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ దిల్ రాజుని ప్రశ్నిస్తున్నారు.  సంక్రాంతి పోటీ విషయానికి వస్తే ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్), వీరసింహారెడ్డి రిలీజ్ ఖరారు చేసుకున్నాయి.  దిల్ రాజు ఇంతకుముందు చెప్పిన లాజిక్ ప్రకారం తమిళ సినిమా అయిన ‘వారసుడు’కి థియేటర్ల కేటాయింపు విషయంలో వెనక్కి తగ్గుతారా..అనేక చూడాలి.  

'వారసుడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినెమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.

PREV
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది