పద్మవిభూషణ్‌ వచ్చాక మొదటిసారి పబ్లిక్‌లోకి చిరంజీవి.. వరుణ్‌ తేజ్‌ సినిమా కోసం గెస్ట్ గా..

Published : Feb 24, 2024, 02:33 PM IST
పద్మవిభూషణ్‌ వచ్చాక మొదటిసారి పబ్లిక్‌లోకి చిరంజీవి.. వరుణ్‌ తేజ్‌ సినిమా కోసం గెస్ట్ గా..

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల ప్రతిష్టాత్మక `పద్మవిభూషణ్‌` పురస్కారం వరించింది. ఈ నేపథ్యంలో ఆయన మొదటిసారి పబ్లిక్‌లో మెరవబోతున్నారట. దీంతో ఆయన ఏం మాట్లాడబోతున్నారో ఆసక్తికరంగా మారింది.   

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ కోసం పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. వరుణ్‌ సినిమాని సపోర్ట్ చేసేందుకు వస్తున్నారు. ఇటీవల చిరంజీవి గెస్ట్ గా వచ్చిన `హనుమాన్‌` మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు తన కొడుకు సినిమా ఫంక్షన్‌కి వస్తున్నాడంటే ఈ మూవీపై కూడా ఆసక్తి పెరుగుతుంది. 

వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం `ఆపరేషన్‌ వాలెంటైన్స్` చిత్రంలో నటిస్తున్నారు. ఎయిర్‌ ఫోర్స్ ప్రధానంగా సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఉగ్రవాదుల ఎటాక్‌కి రివేంజ్‌ తీర్చుకునే కథాంశంతో ఈ మూవీ రూపందుతుంది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. తెలుగులో ఎయిర్‌ ఫోర్స్ ప్రధానంగా సినిమా రావడం ఇదే తొలి సారి. పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసేలా ఉంది. ఈ మూవీ మార్చి 1న తెలుగు, హిందీలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్‌ని రామ్‌చరణ్‌, సల్మాన్‌ ఖాన్‌ విడుదల చేయడంతో బజ్‌ ఏర్పడింది. 

ఇప్పుడు మెగాస్టార్‌ని దించుతున్నారు. `ఆపరేషన్‌ వాలెంటైన్స్` చిత్రానికి రేపు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయబోతున్నారు. దీనికి చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారు. తాజాగా టీమ్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే మెగాస్టార్‌కి ప్రతిష్టాత్మక పురస్కారం పద్మ విభూషణ్‌ వచ్చిన అనంతరం ఆయన మొదటిసారి బయటకు వస్తున్నారు. దీంతో ఆయన ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఈవెంట్‌లో సల్మాన్‌ని సత్కరించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే చిరు నుంచి వచ్చే మాటలు సైతం ఆసక్తిని రేకెత్తించబోతున్నాయి. 

`ఆపరేషన్‌ వాలెంటైన్స్` మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రేపు ఆదివారం(ఫిబ్రవరి 25)న హైదరాబాద్‌లోని జేఆర్‌సీలో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌ని చాలా స్పెషల్‌గా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో వరుణ్‌ తేజ్‌ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నారు. ఆయనకు జోడీగా, రాడార్‌ ఆఫీసర్‌ పాత్రలో మానుషి చిల్లర్‌ నటిస్తుంది. రుహానీ శర్మ, నవదీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని మార్చి 1న రిలీజ్‌ చేయబోతున్నారు. అంతేకాదు దీనితో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్‌ తేజ్‌. 

Read more: RC 16: రాంచరణ్, బుచ్చిబాబు చిత్రం నుంచి క్రేజీ అప్డేట్.. 'సైరా' డీవోపీ ఫిక్స్
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం