
అంటే సుందరానికీ.. ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శత్వంలో నేచురల్ స్టార్ నాని మరోసారి నటిస్తున్న చిత్రం 'సరిపోదా శనివారం'. డివివి దానయ్య నిర్మాణంలో గత ఏడాది విజయదశమి సందర్భంగా ఈ చిత్రం ప్రారంభం అయింది. నేడు శనివారం నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా సరిపోదా శనివారం చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.
గ్లింప్స్ వీడియో అదిరిపోయింది అనే చెప్పాలి. ఎస్ జె సూర్య వాయిస్ ఓవర్ తో నాని పాత్ర గురించి వివరించిన విధానం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎస్ జె సూర్య వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ మొత్తం ఉంది. కోపాలు రకరకాలు.. ఒక్కో మనిషి కోపం ఒక్కోలా ఉంటుంది.
కానీ కోపాన్ని క్రమబద్ధంగా, పద్దతిగా వారం లో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చ నాకొడుకుని ఎవరైనా చూశారా ?నేను చూశాను అంటూ నాని పాత్రని వివరించడం చాలా బావుంది. అతడి పేరు సూర్య.. రోజు శనివారం అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఎస్ జె సూర్య ఈ చిత్రంలో విలన్ గా పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు.
అంటే నానికి శనివారం రోజు మాత్రమే అతీతమైన శక్తులు వస్తాయని.. సూపర్ హీరోగా మారుతాడని.. మిగిలిన రోజుల్లో కామన్ మాన్ గా ఉంటాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్ర కథలో అసలు పాయింట్ నానికి ఆ ఒక్కరోజు శక్తులు రావడమే అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో చూడాలి.
ఆగష్టు 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.