Susmita Konidela:చిరంజీవి మూవీ కోసం రంగంలోకి దిగిన పెద్ద కుమార్తె సుస్మిత

Published : Mar 10, 2022, 04:28 PM IST
Susmita Konidela:చిరంజీవి మూవీ కోసం రంగంలోకి దిగిన పెద్ద కుమార్తె సుస్మిత

సారాంశం

చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టిన మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల(Susmita Konidela) జోరు పెంచారు. ఆమె చిరంజీవి 154వ చిత్రం కోసం రంగంలోకి దిగారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది. 

సుస్మిత కొణిదెల చిత్ర పరిశ్రమపై దృష్టిపెట్టారు. నిర్మాతగా చిత్రాలు, సిరీస్ల నిర్మాణం చేపట్టారు. ఇక వృత్తి పరంగా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్. ఈ నేపథ్యంలో చిరంజీవి 154 (Mega 154)వ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. నేడు సుస్మిత బర్త్ డే నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని ప్రకటించారు. దర్శకుడు బాబీ ఆమెకు బర్త్ డే విషెష్ తెలియజేయడమే కాకుండా... తమ చిత్రానికి సుస్మిత మోర్ ఎనర్జీ అంటూ ప్రశంసించారు. 

చిరంజీవి (Chiranjeevi)గత చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రానికి కూడా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. చిరంజీవి 154వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు బాబీ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. వాల్తేరు శ్రీను, వాల్తేరు వీరయ్య అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

మరోవైపు సమ్మర్ కానుకగా చిరంజీవి ఆచార్య (Acharya)విడుదల కానుంది. ఏప్రిల్ 29న ఆచార్య విడుదల చేస్తున్నారు. రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ తో భోళా శంకర్ చిత్రాలలో చిరంజీవి నటిస్తున్నారు. యువ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ మూవీ ప్రకటించారు. కుర్ర హీరోలకు ధీటుగా చిరంజీవి ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌