Nagababu: మంచు విష్ణు హెయిర్ స్టైలిష్ట్ నాగ శ్రీనుని ఏడాది క్రితమే కలిసిన నాగబాబు... కారణం!

Published : Mar 10, 2022, 03:28 PM IST
Nagababu: మంచు విష్ణు హెయిర్ స్టైలిష్ట్ నాగ శ్రీనుని ఏడాది క్రితమే కలిసిన నాగబాబు... కారణం!

సారాంశం

మంచు విష్ణు హెయిర్ స్టైలిష్ నాగ శ్రీనుతో నాగబాబు చాలా కాలం నుండి అనుబంధం ఉన్నట్లు తాజా ట్వీట్ తో అర్థమవుతుంది. కొద్దిరోజుల క్రితం నాగ శ్రీనును కలిసి ఆర్థిక  సహాయం చేసిన నాగబాబు.. లేటెస్ట్ ట్వీట్ లో ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

ఓ ఏడాది క్రితం గడ్డం, మీసకట్టుతో నాగబాబు(Nagababu) ఓ ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటో షూట్ లో నాగబాబు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసింది నాగ శ్రీను అన్న విషయం బయటికి వచ్చింది. నాగబాబు తాజాగా 2021 ఫిబ్రవరిలో చేసిన ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అలాగే తన మేక్ ఓవర్ కి కారణం నాగ శ్రీను అంటూ కామెంట్ చేశారు. తన టాలెంట్ తో సక్సెస్ అవుతాడని కితాబు పలికాడు. తాను చేసిన సాయం నిమిత్త మాత్రం అంటూ నాగ శ్రీను గొప్పతనాన్ని కొనియాడారు. 

నాగబాబు ట్వీట్ తో వీరిద్దరికీ చాలా కాలంగా పరిచయం ఉన్నట్లు అర్థమవుతుంది. కాగా గత నెలలో నాగ శ్రీను ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చాలా కాలంగా హీరో మంచు విష్ణు వద్ద హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తున్నాడు. కాగా మంచు విష్ణు తన ఆఫీస్ లోని విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని నాగ శ్రీను దొంగిలించాడు అంటూ కేసు పెట్టాడు. మంచు విష్ణు ఆరోపణలు ఖండించిన నాగ శ్రీను.. కులం పేరుతో దుర్భాషలాడటం, వేధించడంతో ఉద్యోగం మానేశాను. అయినప్పటికీ నన్ను వదలకుండా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ నాగ శ్రీను వీడియో సందేశం విడుదల చేశారు. 

ఈ వీడియో వైరల్ కావడంతో పాటు నాయి బ్రాహ్మణ సంఘాలు మంచు కుటుంబంపై నిరసనలు వ్యక్తం చేశాయి. ఏకంగా మానవ హక్కుల సంఘంలో మంచు ఫ్యామిలీపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే నాగబాబు హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను (Naga Srinu)కుటుంబాన్ని కలిసి రూ. 50 వేలు ఆర్థిక సాయం చేశాడు. నాగ శ్రీను తల్లితో పాటు కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్య సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చాడు. పరిశ్రమలో నాగబాబుకి మంచు ఫ్యామిలీకి పచ్చిగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అందుకే నాగబాబు మంచు ఫ్యామిలీ బాదితుడిగా ప్రచారం అవుతున్న నాగ శ్రీనుకు సహాయం చేశాడని అందరూ భావించారు. 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు వేదికగా మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు రేగిన విషయం తెలిసిందే. మా ప్రెసిడెంట్ పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు(Manchu Vishnu) తలపడ్డారు. మంచు విష్ణుకు పరిశ్రమలోని ఒక సామాజిక వర్గం పూర్తి మద్దతు ఇచ్చింది . అదే సమయంలో ప్రకాష్ రాజ్ వెనుక మేమున్నామంటూ నాగబాబు, పవన్ బహిరంగంగా ప్రకటించారు. చిరంజీవి సైతం పరోక్షంగా మద్దతిచ్చారు. ఇరు వర్గాలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై గెలిచి... ఆధిపత్యం చాటుకున్నారు . మంచు విష్ణు గెలుపును నాగబాబు అంగీకరించలేదు. ఆయన తీవ్ర అసహనానికి గురికావడంతో పాటు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.a

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూడలేక వెనక్కి వెళ్ళిపోయిన స్టార్ హీరో, అసలేం జరిగిందో తెలుసా ?