అది మా బ్లడ్ లోనే ఉంది.. రాధే శ్యామ్ విషయంలో చిన్న టెన్షన్, ప్రభాస్ చెల్లి సాయి ప్రసీద కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 10, 2022, 04:16 PM IST
అది మా బ్లడ్ లోనే ఉంది.. రాధే శ్యామ్ విషయంలో చిన్న టెన్షన్, ప్రభాస్ చెల్లి సాయి ప్రసీద కామెంట్స్

సారాంశం

ప్రభాస్ సోదరి, కృష్ణం రాజు కుమార్తె సాయి ప్రసీద రాధే శ్యామ్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడతానని చెప్పినప్పుడు అన్నయ్య ప్రోత్సహించారని తెలిపారు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సినిమాపై ఇప్పటికే ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ఇది.  రాధే శ్యామ్ మూవీ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఈ చిత్రంలో ప్రభాస్ పామ్ ఆర్టిస్ట్ ( హస్తసాముద్రిక నిపుణుడు) గా నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ తో పాటు కృష్ణం రాజు కూడా నిర్మిస్తున్నారు. తన సొంత బ్యానర్ గోపి కృష్ణ క్రియేషన్స్ రాధే శ్యామ్ చిత్రానికి కో ప్రొడక్షన్ చేస్తోంది. నిర్మాణ బాధ్యతలని కృష్ణం రాజు కుమార్తె సాయి ప్రసీద చూసుకుంటున్నారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో సాయి ప్రసీద ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

తాను సినిమాలపై ఆసక్తితో అమెరికాలో ప్రొడక్షన్ కోర్స్ చేసినట్లు సాయి ప్రసీద పేర్కొన్నారు. ఆ తర్వాత ఏదైనా బిజినెస్ చేద్దామని లండన్ వెళ్లి మాస్టర్స్ కూడా చేశాను. బిజినెస్ ప్రారంభించిన తర్వాత మళ్ళీ సినిమాలపై ఆసక్తి పెరిగితే సమయం వృధా అవుతుంది. అందుకే సినిమాలవైపు వచ్చాను. 

ప్రొడక్షన్ చేస్తానని నాన్నతో మొదట చెప్పాను. అయితే అన్నయ్యతో ఒక మాట చెప్పు అని అన్నారు. దీనితో అన్నయ్య ప్రభాస్ కు వెళ్లి విషయం చెప్పా. నీకు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందని నాకు ఆల్రెడీ తెలుసు. నేనే ఆ విషయం అడిగి నీలో ఒపీనియన్ క్రియేట్ చేయకూడదు అని భావించా. ఇప్పుడు నువ్వే అడిగావు. 

నాకు తెలిసింది నేను నేర్పిస్తా. నాన్నగారు కూడా కొన్ని విషయాలు చెబుతారు. ఆ తర్వాత నీ కష్టం నీదే అని అన్నయ్య అన్నారు. రాధే శ్యామ్ చిత్రం విషయానికి వస్తే.. 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించాం. అదే కొంచెం టెన్షన్ గా ఉంది. కానీ అవుట్ పుట్ అద్భుతంగా ఉంది. సో మేమంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అని సాయి ప్రసీద అన్నారు. రాధే శ్యామ్ తర్వాత విభిన్నమైన కథలతో చిన్న సినిమాలు నిర్మించాలనే కోరిక ఉన్నట్లు సాయి ప్రసీద అన్నారు.   

ఇక వివిధ వంటకాలతో విందు ఇవ్వడంలో కృష్ణం రాజు, ప్రభాస్ పేర్లు ఇండస్ట్రీలో మారుమోగుతున్నాయి. దీని గురించి సాయి ప్రసీద స్పందిస్తూ.. అది మా బ్లడ్ లోనే ఉంది. మలేషియాలో బిల్లా షూటింగ్ జరుగుతున్నపుడు యూనిట్ మొత్తానికి మా అమ్మే వండి పెట్టింది. అలా నాక్కూడా అలవాటైంది అని సాయి ప్రసీద తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం